NTV Telugu Site icon

Hyderabad: సాఫ్ట్ వేర్ కంపెనీ బడా మోసం.. ఉద్యోగాలిప్పిస్తామంటూ నగదు వసూలు చేసి బోర్డు తిప్పేసిన వైనం

New Project (10)

New Project (10)

సాఫ్ట్ వేర్ ఫీల్డ్ పై యువతలో ఉన్న మోజును క్యాష్ చేసుకునేందుకు.. పుట్టగొడుగుల్లా పుట్టకొస్తున్న కొన్ని కంపెనీలు నిరుద్యోగులను నిలువనా ముంచేస్తున్నాయి. ఉద్యోగాలు ఇప్పిస్తా మంటూ నిరుద్యోగుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ మాటలు నమ్మిన చాలామంది నిరుద్యోగులు రూ. వేలల్లో నగదు చెల్లించారు. దీంతో ఆ కంపెనీని అకస్మాత్తుగా మూసేశారు. ఆగ్రహానికి గురైన నిరుద్యోగులు పోలీస్ స్టేషన్ బాటపట్టారు. వివరాల్లోకి వెళితే.. సాఫ్ట్ వేర్ డవలపర్ కంపెనీ బడా మోసం బడా మోసం బయటపడింది. గచ్చిబౌలిలో సాఫ్ట్ వేర్ డవలపర్ కంపెననీ మోసానికి పాల్పడింది. ఉద్యోగుల దగ్గర డిపాజిట్ ఫీజులు వసూలు చేసి బోర్డు తిప్పేసింది సాఫ్ట్ వేర్ కంపెని. రైల్ వరల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో దేశ వ్యాప్తంగా అయిదు బ్రాంచ్ లు ఉన్నాయి. ఉద్యోగాలు ఇస్తామాంటూ 800 మంది దగ్గర రైల్ వరల్డ్ కంపెనీ సెక్యూరిటీ డిపాజిట్లు వసూలు చేసింది.

READ MORE: Gorantla Butchaiah Chowdary: ఏపీ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి

ఒక్కో ఉద్యోగి దగ్గర రూ.40 నుంచి రూ.50వేలు వసూలు చేసింది. అందరి ఉద్యోగుల నుంచి దాదాపు 5 కోట్ల రూపాయలు వసూలు కాగానే బోర్డు తిప్పేసింది. ఇదే కంపెనీ మూడు నెలల క్రితం గచ్చి బౌలిలోనూ బ్రాంచ్ ఓపెన్ చేసింది. ఒక్కో ఉద్యోగి దగ్గర 40 వేల రూపాయల వసూలు చేసింది. ఒక్క గచ్చి బౌలిలోనే 40 లక్షల రూపాయల వసూలు చేసింది. రైల్ వరల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ యాజమాని ఉద్యోగులకు షాకిచ్చింది. కంపెని క్లోజ్ చేశామాంటూ తెలిపింది. కంపెని మోసంతో రోడ్డున పడ్డ 100 మంది ఉద్యోగులు..రాయ దుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపడుతున్నట్లు సమాచారం.