NTV Telugu Site icon

UP: దారుణం.. టాయిలెట్‌ పైపులో కూరుకుపోయిన ఆరు నెలల పిండం!

A Six Month Old Fetus

A Six Month Old Fetus

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఆదివారం దారుణ ఘటన చోటుచేసుకుంది. పుట్టక ముందే ఓ పసికందును చంపేశారు. ఆ పిండాన్ని టాయిలెట్ పైపులో పారేశారు. ఇంటి టాయిలెట్ పైపులో కూరుకుపోయిన ఆరు నెలల పిండాన్ని యజమాని వెలికి తీశారు. ఈ మేరకు ఓ వార్తా సంస్థకు పోలీసులు సమాచారం అందించారు.

READ MORE: Parliament: జార్జ్ సోరోస్‌తో సోనియా గాంధీకి ఉన్న సంబంధంపై పార్లమెంటులో రచ్చ..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటి యజమాని దేవేంద్ర అలియాస్ దేవకి చెందిన ఓ భవనంలో టాయిలెట్ పైపులో నీరు జామ్ అయ్యింది. పలు చోట్లు పైపు ఉబ్బిపోయి పగిలి పోయింది. నీరు బయటకు కారుతుంటడటంతో యజమానికి ఫ్లంబర్ సాయంతో పైప్‌ను పడులగొట్టించి ఏం జరిగింది? అని చూశారు. ఆ పైపులో దృశ్యాన్ని చూసిన వారు ఆశ్చర్యానికి గురయ్యారు. అందులో ఆరు నెలల పిండం బయటపడింది. దీంతో ఇంటి యజమాని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టరు. తన ఇంట్లో 9 మంది అద్దెదారులు ఉన్నారని దేవేంద్ర పోలీసులకు తెలిపారు. ఈ సమాచారం అందిన వెంటనే పరిసర ప్రాంతాల ప్రజలు కూడా గుమిగూడారు. పోలీసులు ఇంట్లో నివసిస్తున్న అద్దెదారులను విచారిస్తున్నారు. చట్టపరమైన చర్యలు పూర్తి చేసిన తర్వాత, పిండం సురక్షితంగా ఉంచారు.

READ MORE: Dr. Prakash Vinnakota: డాక్టర్ ప్రకాష్ విన్నకోటకు ప్రతిష్టాత్మకమైన కామధేను అవార్డు..

Show comments