Site icon NTV Telugu

Bus Accident: పాడేరులో ఘోర రోడ్డు ప్రమాదం.. 100 అడుగుల లోయలో పడ్డ ఆర్టీసీ బస్సు

Accident

Accident

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అల్లూరి జిల్లా పాడేరు ఘాట్ రోడ్డు వద్ద ఆర్టీసీ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. మోదమాంబ పాదాలకు 3 కి.మీ దూరంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదం జరిగిన బస్సులో సుమారు 25 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు.

Read Also: Gudivada Amarnath: గల్లీ క్రికెట్లో గెలిచి వరల్డ్ కప్ గెలిచినట్లు ఫీలవుతున్నారు.. టీడీపీపై విమర్శనాస్త్రాలు

ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. 23 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. బస్సు చోడవరం నుంచి పాడేరు వెళుతుండగా ప్రమాదం జరిగింది. అయితే బస్సు డ్రైవర్ చెట్టు కొమ్మను తప్పించబోవడంతో బస్సు లోయలోకి దూసుకుపోయింది. సుమారు బస్సు 100 అడుగుల లోయలోకి పడిపోయింది. ఘాట్ రోడ్డులోని వ్యూ పాయింట్ వద్ద మలుపు తిరుగుతుండగా, బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది.

Read Also: Chandrayaan-3: చంద్రయాన్‌-3పై ఇస్రో కీలక ప్రకటన.. సర్వత్రా ఉత్కంఠ

ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. ఈ ప్రమాద ఘటనపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Exit mobile version