NTV Telugu Site icon

Nirmal District: కాశీ యాత్రకు వెళ్లిన వ్యక్తి సజీవ దహనం..

Nirmal

Nirmal

తెలంగాణ రాష్ట్రం బైంసా నుంచి ఉత్తరప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీకి వెళుతున్న బస్సులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. దీంతో బస్సులోని ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. మృతుడు.. కుబీర్ మండలం పల్సి గ్రామానికి చెందిన శీలం దుర్పత్తిగా గుర్తించారు. సజీవ దహనం ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. ఈ గ్రామం నుంచి 8 మంది యాత్రకు వెళ్లారు. వారితో పాటు 50 మంది బస్సులో ఉన్నారు. మిగతా వాళ్ళంతా సురక్షితంగా ఉన్నారు. మంటలు చెలరేగే సమయంలో దుర్పత్తి, డ్రైవర్ మాత్రమే బస్సులో ఉన్నారు. డ్రైవర్ బయట పడగా.. సజీవ దహనం అయ్యారు. ఈ ప్రమాద ఘటన యూపీలోని బృందావనంలో చోటు చేసుకుంది.

READ MORE: Sri Krishna Janmabhoomi: నేడు మథురలో వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ..

సమాచారం అందుకున్న వెంటనే జిల్లా మేజిస్ట్రేట్ శైలేంద్ర కుమార్ సింగ్ ఇతర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై పోలీసులు, అగ్నిమాపక శాఖలు సమగ్ర విచారణలో నిమగ్నమై ఉన్నాయి. బాధిత ప్రయాణికులకు అన్ని విధాలా సాయం చేస్తామని స్థానిక యంత్రాంగం హామీ ఇచ్చింది. ఈ ఘటనపై అధికారులు సంబంధిత వర్గాలకు సమాచారం అందించారు. కాశీకి వెళ్ల కుండానే అనంత లోకాలకు చేరుకున్న ద్రుపత్ కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

READ MORE: Congress New Office: నేడు డిల్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం..

Show comments