అరుదైన వలస పక్షి నారాయణపేట ఎక్లాస్ పూర్ అర్భన్ పార్కలో దర్శనమిస్తుంది. ఈ అరుదైన పక్షిని ఇండియన్ పిట్ట గా పిలుస్తుంటారు. చాలా రంగులతో బ్యూటిపుల్ గా ఉంటుంది ఈ పిట్ట. రాలిపోయిన ఆకుల కింద ఉండే కీటకాలను తింటూ మనుగడ కొనసాగిస్తుంది. ఇది చాలా సిగ్గరి. ఉదయం సాయంత్రం ఆక్టివ్ గా ఉంటూ వినసొంపుగా ఉండే.. ఒక ప్రత్యేకమైన శబ్దాన్ని ఈ పక్షి చేస్తుంది. హైదరాబాద్ కు చెందిన వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఈ పక్షిని అతి కష్టంపై తన కెమెరాలో దీనిని బంధించారు.
Also Read : Bandi Sanjay : మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవం
ఈ పక్షి హిమాలయ అడవుల్లో.. మధ్య, పశ్చిమ భారతదేశంలోని కొండల్లో ఆకురాల్చే, దట్టమైన అడవుల్లో నివాసం ఉంటుంది. శీతాకాలంలో దక్షిణభారతంలోని దట్టమైన అరణ్యాలకు వలస వస్తుంటుంది. ఈ పక్షి ఇక్కడ కనిపించడం నారాయణపేట అడవుల అభివృద్దికి నిదర్శనమని ఫారెస్ట్ అధికారులు భావిస్తున్నారు. నారాయణపేటలో ఇంకా చాలా పక్షి జాతులు, వన్య ప్రాణులు ఉన్నాయన్నారు. వాటిని అన్వేషించి ప్రజల్లో అవగాహన పెంచడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఎక్లాస్ పూర్ అర్భన్ పార్క్ ను అభివృద్ది చేయడంతో పాటు పక్షులకు అణువుగా ఉండేలా తీర్చిదిద్దుతామన్నారు.
Also Read : Viral : స్నేక్ క్యాచర్లను ఆటాడుకున్న కింగ్ కోబ్రా.. లాస్ట్ కి ఏం జరిగిందో తెలుసా..?
రాబోయే కాలంలో నారాయణపేటలోని వివిధ పాఠశాలల్లో బర్డ్ వాచింగ్, అడువులు, వన్య ప్రాణుల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని అధికారులు అంటున్నారు. పలు జాతులకు చెందిన పక్షులను, వన్య ప్రాణులను ఫారెస్ట్ అధికారులు సంరక్షిస్తున్నారు. ఈ పక్షిని చూసేందుకు భారీగా తరలివస్తున్నారు. ఇలాంటి అరుదైన పక్షి జాతులను సంరక్షించుకోవాలని ఫారెస్ట్ అధికారులు వెల్లడిస్తున్నారు.