Site icon NTV Telugu

Suicide Attempt: నలుగురు స్నేహితుల మధ్య గొడవ.. విషం తాగి ఆత్మహత్యాయత్నం

Suside Attempt

Suside Attempt

బీహార్‌లోని ఔరంగాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. నలుగురు స్నేహితులు కలిసి విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం హరిహరగంజ్ కు తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం.. ఔరంగాబాద్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే.. వారి పరిస్థితి మరింత విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. మళ్లీ అక్కడి నుండి గయాలోని మగద్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు రిఫర్ చేశారు. ఇక్కడ చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనతో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Anil Ravipudi: భగవంత్ కేసరి హిట్.. కాస్ట్లీ గిఫ్ట్ పట్టేసిన డైరెక్టర్

ఆత్మహత్యయత్నానికి పాల్పడింది నలుగురు బాలికలుగా గుర్తించగా.. వారు నందిని, లక్కీ, రియా, పూనమ్‌. వీరంతా సందా ప్రాంతానికి చెందినవారు. కాగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన బాలికను రియాగా గుర్తించారు. ఈ నలుగురు మంచి స్నేహితులని.. వీరు సూసైడ్ చేసుకోవడానికి కారణమేంటో తెలియడం లేదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. విషం తాగే ముందు ఏదో విషయంలో గొడవ పడ్డారని.. ఆ తర్వాత అందరూ కలిసి దాన్ని తాగారని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ప్రేమ వ్యవహారం కారణంగా చెబుతున్నారు. అయితే ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Lokesh kanagaraj : కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన స్టార్ డైరెక్టర్..

గతంలో 2022లో కూడా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఔరంగాబాద్ జిల్లాలో ప్రేమ వ్యవహారంలో ఆరుగురు బాలికలు కలిసి విషం తాగారు. ఈ ఘటనలో నలుగురు బాలికలు చనిపోయారు. జిల్లాలోని రఫీగంజ్‌లోని కస్మా పోలీస్ స్టేషన్ పరిధిలోని చిరాయిలా గ్రామంలో ప్రేమ వ్యవహారంలో ఓ యువతి విషం తాగింది. ఆ తర్వాత తన ఐదుగురు స్నేహితులు ఒకరి తర్వాత ఒకరు విషం సేవించారు.

Exit mobile version