Site icon NTV Telugu

Robbery : ప్రియురాలి మోజులో పడి పని చేస్తున్న సంస్థకే కన్నం వేసిన ఘనుడు

Robbery

Robbery

హైదరాబాద్ నారాయణగూడ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో సుల్తాన్ బజార్ ఏసీపీ శంకర్ మాట్లాడుతూ… బషీర్ బాగ్ చంద్ర నగర్ కు చెందిన మర్రి సాయి లక్ష్మణ్ గత 8 ఏళ్లుగా బషీర్ బాగ్ లోని శ్రీ సిద్ది వినాయక్ జెవెల్లెర్స్ అండ్ ఎక్స్ పోర్ట్స్ ప్రేవేట్ లిమిటెడ్ లో స్టాక్ ఇంచార్జ్ గా పని చేస్తున్నాడు. గత రెండు నెలల క్రితం సాయి లక్ష్మణ్ డ్యూటీ కు రాకుండా , ఫోన్ చేసిన లిఫ్ట్ చేయకపోవడంతో … సదరు యజమానికి అనుమానం వచ్చి , ఆడిట్ నిర్వహించాడు. అందులో 28 తులాల బంగారం మిస్సింగ్ అయినట్లు గుర్తించారు.

CM Chandrababu: రేపు సోమశిల జలాశయాన్ని పరిశీలించనున్న సీఎం చంద్రబాబు

దీనితో అనుమానం వచ్చిన యజమాని నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు తో కేసు నమోదు చేసుకొని , సాయి లక్ష్మణ్ ను అదుపులోకి తీసుకొని , తమదైన శైలిలో విచారించారు. దీనితో తానే దొంగతనానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడించాడు. 28 తులాలతో పాటు 8 తులాల డైమెండ్ నక్లెస్ దొంగిలించి మనప్పురం గోల్డ్ లో తాకట్టు పెట్టినట్లు తెలిపాడు. దొంగిలించిన బంగారాన్ని విక్రయిస్తూ , తన లవర్ తో దేవస్థానాలు తిరిగినట్లు ఒప్పుకున్నాడు. అతని వద్ద నుండి మూడు తులాల బంగారం తో పాటు మనప్పురం లో తాకట్టు పెట్టిన డైమాండ్ నక్లెస్ ను రికవరీ చేసినట్లు ఏసీపీ తెలిపారు.

Kolkata doctor case: కోల్‌కతా డాక్టర్ కేసులో అనేక అనుమానాలు.. ఘటన వెనక డ్రగ్స్ రాకెట్..?

Exit mobile version