Viral Video: మొసలి ఎంత క్రూరమైనదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నీటిలో ఉండే జెయింట్ క్రోకోడైల్.. అడవి రాజు(సింహం) కంటే ప్రాణాంతకం అని చెబుతారు. ఈ భయంకరమైన జంతువు దాని శక్తివంతమైన దవడలలో ఎవరినైనా పట్టుకుంటే.. ఇట్టే నమిలి మింగేస్తుంది. అయితే అలాంటి భయంకరమైన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియో చూసిన జనాలు తమ మెదడుకు పనిచెప్పారు. ఆ వీడియో చూస్తున్న సమయంలో చాలా మందికి గుండె చప్పుడు పెరిగి ఉంటుది.
Read Also: Leo : ఆ ఒక్క సీన్ కోసం అన్ని కోట్లు ఖర్చు పెట్టారా?
ఆ వీడియోలో నరమాంస భక్షక జంతువు(మొసలి) పక్కన ఓ వ్యక్తి పడుకొని ఉన్నాడు. మొసలికి దగ్గర్లో ఎవరూ కూడా సంచరించకుండా దూరంగా ఉంటారు. అయితే ఈ వీడియోలో.. మీరు భారీ మరియు చాలా భయంకరమైన మొసలిని చూడవచ్చు. దాని పక్కనే ఒక వ్యక్తి పడుకుని ఉన్నాడు. కొన్ని సెకన్ల ఈ క్లిప్ ప్రజల గుండె చప్పుడును పెంచింది. మొసలి ఆగ్రహానికి గురైతే ఆ వ్యక్తికి ఏమై ఉండేదో ఊహించండి. పెద్ద మొసలి పక్కనే మనిషి చాలా హాయిగా పడుకున్నప్పటికీ.. నిజంగానే ఆశ్చర్యపరిచే దృశ్యం కనిపిస్తుంది. ఆ వ్యక్తి మొసలి తోక పక్కన పడుకున్నట్లు మీరు చూడవచ్చు. అయితే అదే సమయంలో మొసలి ఒక్కసారి అతనిపై దాడి చేస్తే.. ఇంకేముంది అతని ప్రాణాలు గంగలో కలిసినట్లే.
Read Also: Venu Yeldandi : బలగం డైరెక్టర్ సెకండ్ మూవీ లైన్ లీక్… స్టార్ హీరోతో ఇన్స్పిరేషనల్ స్టోరీ?
అయితే ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ఇంత ధైర్యం మీకు ఉందా.. అని ప్రశ్నిస్తున్నారు. వీడియోలో చూసిన మనమే ఇలా వణికిపోయామంటే.. ఆ వ్యక్తి అక్కడే మొసలి పక్కన ఉన్నాడు.. అతను ఏమై ఉంటాడో అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.