NTV Telugu Site icon

Nellore News: నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ వ్యక్తి!

Nellore Collector Office

Nellore Collector Office

కావలి రూరల్ మండలం బుడం గుంటకు చెందిన బాలయ్య అనే వ్యక్తి నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇంటి స్థలం వివాదానికి సంబంధించి ఐదేళ్లుగా అధికారులు చూట్టూ తిరుగుతున్నా.. పట్టించుకోవడంలేదని ఆరోపించారు. అధికారుల తీరుకు నిరసనగా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడంతో స్థానికులు అడ్డుకున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు బాలయ్యను అదుపులోకి తీసుకున్నారు.

Also Read: Sambal Conflict: సంభల్‌లో ఉద్రిక్తత.. యూపీ సర్కార్పై ప్రియాంక గాంధీ ఫైర్

2007లో అప్పటి ప్రభుత్వం తనకు నివాసం కోసం స్థలం కేటాయించిందని, తాను ఇల్లు నిర్మించుకుంటుంటే వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారని బాలయ్య ఆరోపించారు. స్థలానికి సంబంధించిన పత్రాలను అధికారులకు అందజేసి. న్యాయం చేయాలని కోరినా పట్టించుకోవడం లేదన్నారు. దీంతో గత్యంతరం లేక తాను ఆత్మహత్యకు పాల్పడాలని నిర్ణయించుకున్నానన్నారు. అనంతరం అధికారులు ఆయనతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

Show comments