NTV Telugu Site icon

Bandaru Dattatreya : తెలుగు రాష్ట్రాల్లో నూతన విద్యా విధానం తీసుకురండి..

Bandaru Datreya

Bandaru Datreya

హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ హన్మకొండలో పర్యటించారు. మాజీ మేయర్ తక్కలపల్లి రాజేశ్వరరావును పరామర్శించి, ఆరోగ్య పరిస్థితి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన రెండు తెలుగు రాష్ట్రాలలో నూతన విద్యా విధానం అమలు చేయాలి అని అన్నారు. పేదరికం నిర్ములన కావాలంటే.. విద్యా విధానంలో సమునమార్పులూ తీసుకుని రావాలి అని హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు.

Also Read : Spider Nesting Inside Ear: చెవి నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ.. చూసి షాకైన డాక్టర్లు..

అందరికీ విద్యను అందించాలి.. దేశంలో పేదరిక నిర్ములన కోసం కేంద్ర ప్రభుత్వం నూతన విధానం అమలు చేస్తోంది అని ఆయన సూచించారు. 2030 నాటికి దేశంలోనూతన విద్యా విధానం అమలు చేయాలనేది ప్రధానమంత్రి మోడీ లక్ష్యం అని హర్యానా గవర్నర్ దత్తాత్రేయ అన్నారు. హర్యానా రాష్ట్రంలో 2025 నాటికి నూతన విద్యా విధానం అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని బండారు దత్తాత్రేయ వెల్లడించారు.

Also Read : Ponguleti Srinivasa Reddy : తక్షణమే రైతులను ఆదుకోండి..

భారత దేశంలో పేదరిక నిర్మూలనలో విద్య ప్రముఖ పాత్ర పోషిస్తుందని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఇందుకోసం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం ఈ నూతన విద్యా విధానం అమలు చేయాలని వెల్లడించారు. దేశంలో నిరక్షరాస్యత, పేదరికం లేకుండా చేసేందుకు ఈ స్కీమ్ ను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందని ఆయన అన్నారు. దేశంలో విద్యావిధానంలో సమూల మార్పులు చేయడంతో పాటు నాణ్యమైన విద్యాతో పాటు భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు.