NTV Telugu Site icon

Uttar Pradesh: తీసుకున్న బాకీ చెల్లించలేదని బట్టలూడదీసి కొట్టిన రౌడీలు

Up

Up

మానవత్వం సిగ్గుతో తలదించుకునే ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలో వెలుగు చూసింది. నోయిడాలోని పండ్ల మార్కెట్‌లో కూరగాయల అమ్మకందారుడు ఓ వ్యక్తి దగ్గర రూ. 3000 అప్పుగా తీసుకున్నాడు. అయితే తన డబ్బులు ఇవ్వాలంటూ తీవ్రంగా కొట్టాడు.. అంతేకాకుండా అతని బట్టలూడదీసి మార్కెట్ మొత్తం తిప్పాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Off The Record: ఆ మంత్రికి ఏమైంది? నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారా..! అధిష్టానం వార్నింగ్ కూడా ఇచ్చిందా..?

నోయిడాలోని పోలీస్ స్టేషన్ ఫేజ్ 2 ప్రాంతంలో మానవాళిని సిగ్గుపడేలా ఈ ఘటన జరిగింది. అయితే అతన్ని కొట్టి నగ్నంగా మార్కెట్ మొత్తం తిప్పుతుంటే.. ఆపాల్సింది పోయి కొంతమంది తమ మొబైల్ ఫోన్లలో వీడియో తీశారు. వివరాల్లోకి వెళ్తే.. వెల్లుల్లి కొనేందుకు ఓ వ్యక్తి దగ్గర రూ.3000 వేలు బాకీలా తీసుకున్నాడు. అయితే ఆ బకాయి చెల్లించకపోవడంతో మార్కెట్‌లోనే కొంత మంది అతడిని కొట్టారు. అంతేకాకుండా.. బట్టలిప్పేసి మార్కెట్‌ మొత్తం తిప్పారు. అయితే ఈ విషయం పోలీసులకు తెలవడంతో దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు రౌడీలపై చర్యలు తీసుకోవాలని బాధిత వ్యాపారులు డిమాండ్‌ చేస్తున్నారు.

Off The Record: చంద్రబాబు అరెస్టుకు వాస్తు దోషమే కారణమా..? అక్కడే తేడా కొట్టిందా..?

బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతను ఫేజ్ 2 మండిలో దుకాణం నడుపుతుండగా.. వెల్లుల్లిని తీసుకునేందుకు రూ.3వేలు అప్పు చేశారు. మరోవైపు నగదు లావాదేవీల కారణంగానే యువకుడిపై దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకోగా.. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.