NTV Telugu Site icon

Kadapa Crime: తల్లితో సహజీవనం.. నిలదీసిన కొడుకు దారుణ హత్య..

Crime

Crime

Kadapa Crime: తన తల్లితో సహజీవనం చేస్తున్న వ్యక్తిని నిలదీసినందుకు ఓ యువకుడిని దారుణంగా హత్య చేశాడో వ్యక్తి.. గుట్టుగా పదేళ్లుగా సాగుతోన్న వ్యవహారం తప్పు అని మందలించినందుకు.. ఓ మహిళ కొడును హత్య చేసి.. అక్కడి నుంచి జారుకున్నాడు రామచంద్రారెడ్డి అనే వ్యక్తి.. ఈ ఘటన కడప జిల్లాలో కలకలం రేపుతోంది..

Read Also: Deputy CM Pawan Kalyan : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలిసిన సినీ కార్మికులు

కడప జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రొద్దుటూరు కు చెందిన నాగరత్నమ్మ.. రామచంద్రారెడ్డి ఇరువురు ఎన్నో సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్నారు. అయితే, నాగరత్నమ్మకు తన మొదటి భర్తతో మహేశ్వర రెడ్డి అనే కుమారుడు ఉన్నాడు.. అతడి వయస్సు ఇప్పుడు ఇరవై ఐదేళ్లు.. నాగరత్నమ్మ భర్త నుంచి విడిపోయాక రామచంద్రా రెడ్డి పరిచయం అవ్వడంతో దాదాపు 10 సంవత్సరాలుగా నాగరత్నమ్మ, రామచంద్రా రెడ్డి సహజీవనం చేస్తున్నారు. అయితే, గత కొద్ది రోజుల నుంచి తన తల్లి నాగరత్నమ్మ ను కలవకూడదు అని రామచంద్రా రెడ్డిని హెచ్చరిస్తూ వచ్చాడు మహేశ్వర రెడ్డి.. అయినా రామచంద్రారెడ్డి పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే గత రాత్రి కూడా రామచంద్రా రెడ్డి, మహేశ్వర రెడ్డి మధ్య గొడవ జరిగినట్లు నాగ రత్నమ్మ తెలిపింది. తెల్లవారి చూసేసరికి తన కొడుకు రూమ్‌ నిండా, బెడ్ పైన రక్తపు మరకలు ఉండడంతో.. షాక్‌ తిన్న ఆమె.. ఏమైంది..? నా కొడుకు ఎక్కడ అని నిలదీసింది.. కానీ, రామచంద్రరెడ్డి సమాధానం చెప్పకుండా వెళ్లిపోయాడు అని మృతుడు తల్లి నాగ రత్నమ్మ కన్నీరుపెట్టుకుంది.. ఇక, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. నాగరత్నమ్మ ఇంటిని పరిశీలించి డాగ్ స్వాడ్ ను రప్పించారు. రామచంద్రా రెడ్డి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.