NTV Telugu Site icon

Selfie Video: మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో సెల్పీ వీడియో కలకలం.. బీఆర్ఎస్ నాయకుడి వేదింపులు తాళలేక..!

Selfie Video

Selfie Video

A Man’s Selfie Video goes viral at Mancherial Railway Station: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్‌లో ఓ వ్యక్తి తీసుకున్న సెల్పీ వీడియో కలకలం రేపింది. బీఆర్ఎస్ నాయకుడు వేదింపులు తాళలేక తాను ఆత్మహత్య చేసుకుంటా అంటూ తన కుమారుడితో కలిసి ఓ వ్యక్తి సెల్పీ వీడియో తీసుకున్నాడు. తనకు ప్రాణ హాని ఉందని పోలీసులకు పిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, తనపై దాడులకు ప్రయత్నిస్తున్నారని, ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే వేములవాడ రాజన్న దేవాలయం సన్నిధిలో కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుంటామని వీడియోలో సదరు వ్యక్తి పేర్కొన్నాడు. ఇందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వీడియో ప్రకారం… మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు అండతో జిల్లా బీఆర్ఎస్ నాయకుడు మోటపల్లి గురువయ్య.. లక్షపేటకు చెందిన రాజేందర్ అనే వ్యక్తిని వేదిస్తున్నారు. ఆగష్టు 12న రాజేందర్ ఇంటిపై దాడిచేయించిన గురువయ్య.. అతడి కంపౌండ్ గోడను ధ్వంసం చేశారు. ఈ ఘనపై రాజేందర్ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఇంటిపై దాడి చేసిన సమయంలో వీడియో తీయగా.. ఆ ఫోన్ కూడా గురువయ్య లాక్కేళ్లారు. దీనిపై పోలీసులు ఏమీ స్పందించలేదు.

Also Read: Software Dead: కారు టైరు పేలి.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి!

ఇక అక్టోబర్ 22న అర్ధరాత్రి మోటపల్లి గురువయ్య ఓ సుపారీ గ్యాంగ్ ను పంపించి రాజేందర్‌పై అటాక్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనను ఇరుగుపొరుగు వారు చూసారు. ఈ ఘటనపై రాజేందర్‌ లక్షపేట పోలీసులకు ఫిర్యాదు చేసినా లాభం లేకపోయింది. బీఆర్ఎస్ నాయకుడి వేదింపులు తాళలేక రాజేందర్‌ తన కుమారుడితో కలిసి మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో సెల్పీ వీడియో తీసి తనకు న్యాయం చేయాలని కోరాడు. ఇప్పటికైనా పోలీసులు చర్యలు తీసుకోకపోతే.. వేములవాడ రాజన్న దేవాలయం సన్నిధిలో కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుంటామని వీడియోలో రాజేందర్‌ స్పష్టం చేశాడు. అయితే బీఆర్ఎస్ నాయకుడు గురువయ్య తనను ఎందుకు వేదిస్తున్నాడనే విషయం రాజేందర్‌ చెప్పలేదు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.