NTV Telugu Site icon

Flipkart: ఖరీదైన ఫోన్ ఆర్డర్ చేస్తే రాళ్లు డెలివరీ చేసిన ఫ్లిప్ కార్ట్.. ఆపై సారీ అంటూ..?!

7

7

ప్రస్తుత ప్రజలు ఏ వస్తువైనా సరే ఇంట్లో నుంచి కొనుగోలు చేసే వెసులుబాటు ఏర్పడింది. తినే తిండి నుంచి వాడుకునే వస్తువులు, అలాగే వేసుకునే బట్టలు ఇలా ఏదైనా సరే మీకు నచ్చిన వాటిని ఫోన్లో ఆర్డర్ చేస్తే చాలు ఇట్లే మీ ముందుకు తెచ్చి ఇచ్చే రోజులు ఇది. దీంతో ప్రజలు బయటికి వెళ్లి.. వాటిని చెక్ చేసి తీసుకుందామన్న ఆలోచనకు దూరంగా బతికేస్తున్నారు. అందులో ముఖ్యంగా బట్టలు, ఫోన్స్, తినుబండారాలు లాంటి వాటిని ఎక్కువగా ఆన్లైన్లో ఆర్డర్ చేస్తూ ఉండడం మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాం. అయితే ఇలా ఆన్లైన్లో కొనుగోలు చేసిన సమయంలో ఒక్కొక్కసారి కస్టమర్లకు ఊహించిన విధంగా షాక్ తగులుతుంది.

Also read: Tillu Square: బాక్స్ ఆఫీసును షేక్ చేస్తున్న టిల్లు స్క్వేర్.. కలెక్షన్స్ ఎంతంటే..!

అందులో భాగంగానే ముఖ్యంగా సెల్ ఫోన్ లాంటి ఖరీదైన వస్తువులను కొనుగోలు చేసినప్పుడు అనేక మార్లు సెల్ ఫోన్ బదులు వివిధ రకాల వస్తువులు రావడం మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటుంది. అచ్చం అలాగే తాజాగా ఓ కస్టమర్ ఖరీదైన ఫోన్ ఆర్డర్ చేయను అతడికి ఫోన్ బదులు రాళ్లను పంపించింది సదరు సంస్థ. ఫ్లిప్ కార్ట్ ఒక ఈ కామర్స్ సంస్థ. ఈ సంస్థలో భాగంగా ఘజియాబాద్‌ కు చెందిన వ్యక్తి ఓ సెల్ ఫోన్ ను ఆర్డర్ చేసుకున్నాడు. అయితే ఆ వస్తువును తీసుకున్న తర్వాత పార్సల్ ఓపెన్ చేయగా అందులో రాళ్లు దర్శనమిచ్చాయి. ఆ రాళ్ళను చూడగానే ఆ వ్యక్తి తన సెల్ ఫోన్ డెలివరీ విషయంలో ఏదో తప్పు జరిగిందని భావించి ఫ్లిప్ కార్ట్ సంస్థకు తను జరిగిన విషయాన్ని తెలియజేశాడు.

Also read: Dina Boluarte: చిక్కుల్లో పెరూ దేశ అధ్యకురాలు డైనా.. ఖరీదైన వాచీ కారణమా..?!

సదరు వ్యక్తి ఫ్లిప్ కార్ట్ నుంచి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేశాడు. అయితే ఫోన్ బదులు రాళ్లు వచ్చిన తర్వాత తిరిగి ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు ఫ్లిప్ కార్ట్ ఆ రిటన్ రిక్వెస్ట్ ను తిరస్కరించింది. దీంతో ఆ కస్టమర్ కష్టాలు మరింతగా పెరిగాయి. ఇందులో భాగంగా ఫ్లిప్కార్ట్ మీరు ఆర్డర్ చేసినవి తప్ప మరి ఏమి మీరు పొందాలని మేము ఎప్పటికీ కోరుకోమనీ., ఇలా జరిగినందుకు తాము చింతిస్తున్నామని తెలియజేసింది. అలాగే మీకు సహాయం చేయడానికి దయచేసి మీ ఆర్డర్ వివరాలను ప్రైవేటు చాట్ ద్వారా మాకు అందించండి తెలుపుతూ.. ఆ వివరాలు తాము గోప్యంగా ఉంచుతామని స్పందించింది. ఇందులో భాగంగానే ఫ్లిప్ కార్ట్ కస్టమర్ ని సున్నితంగా హెచ్చరించింది. తమ సంస్థ పేరుతో ఉన్నతప్పుడు ఖాతాలో అలాగే నకిలీ సోషల్ మీడియా పోస్టులపై స్పందించవద్దని తెలిపింది. చూడాలి మరి చివరికి ఆ కస్టమర్ కి ఫ్లిప్ కార్ట్ ఎలా సాయం చేస్తుందో.