తాజాగా పేరు దేశ అధ్యక్షురాలు డైనా బులురెటే ఓ లగ్జరీ వాచ్ ను ధరించినందుకు కష్టాల్లో చిక్కుకుపోయారు. పెరుగు దేశ అధ్యక్షురాలు డైన అధ్యక్షరాలుగా ఎన్నిక కాకముందు ప్రజా రికార్డులలో ఆమెకు ఎటువంటి రోలెక్స్ లేదా ఖరీదైన వాచీలను చూపెట్టలేదని., కాకపోతే ప్రస్తుతం ఆమె తన చేతికి రోలెక్స్ వాచి పెట్టుకొని ఉండడంతో పెద్ద దుమారమే రేగింది. తాజాగా ఆమె ఓ కార్యక్రమానికి ఖరీదైన వాచి ధరించి హాజరైంది. ఆ సమయంలో ఆ దేశ స్థానిక పత్రికలు అధ్యక్షురాలు పెట్టుకున్న వాచి పై అనేక కథనాలతో హోరెత్తించాయి.
Also read: JaiHanuman: “జై హనుమాన్” మోషన్ పోస్టర్ షేర్ చేసిన ప్రశాంత్ వర్మ…!
దీంతో వెంటనే ఆదేశ అవినీతి నిరోధక శాఖ అధికారులు కోర్టు ఆదేశాల మేరకు లిమాలోని అధ్యక్షరాలు అధికారిక నివాసంలో శనివారం నాడు సోదాలు నిర్వహించారు. ఇందులో భాగంగానే అధ్యక్షురాలు ఎన్నికైన తర్వాత ఆవిడ ఎటువంటి అవినీతికైనా పాల్పడ్డారా..? అన్న విషయాలు సంబంధించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ దేశ అధ్యక్షురాల వద్ద కేవలం ఒక్క లగ్జరీ వాచ్ మాత్రమే కాకుండా అనేక లగ్జరీ వాచీలు ఉన్నట్లు ఆరోపణలు రావడంతో అవినీతి నిరోధక శాఖ అప్రొత్తమై దాడులు నిర్వహించింది. ఈ సోదాలకు సంబంధించిన వీడియోలు అక్కడి టెలివిజన్ ఛానల్లో కూడా ప్రసారమయ్యాయి. అయితే పోలీసులు జరిపిన ఈ సోదాలలో ఎటువంటి ఆధారాలు దొరికాయన్న వివరాలు మాత్రం తెలపలేదు.
Also read: మాడుగుల టీడీపీలో టిక్కెట్ రచ్చ.. బలప్రదర్శనకు సిద్ధమైన మాజీ ఎమ్మెల్యే రామానాయుడు!
ఇక ఈ కేసు వివరాలకు సంబంధించి పేరు దేశ అత్యున్నత న్యాయ స్థానం నియమించిన 20 మంది పబ్లిక్ ప్రాసిక్యూటి అధికారులు, అలాగే 20 మంది అత్యున్నతను పోలీసు అధికారుల సమక్షంలో సోదరులు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈవిడ 2022 డిసెంబర్ నెలలో అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టింది. ఈమె పదవీకాలం జూలై 26 వరకు ఉంది.