Site icon NTV Telugu

Dead Body Found: ప్లాస్టిక్ బ్యాగ్‌లో 7 ముక్కలుగా మృతదేహం.. బీచ్‌లో లభ్యం

Dead Body

Dead Body

Dead Body Found: ముంబైలోని గోరై బీచ్‌లో ఓ వ్యక్తి మృతదేహం 7 ముక్కలుగా లభ్యమైన ఘటన ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. సమాచారం ప్రకారం, వ్యక్తి మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో ఉంచి సీలు చేశారు. మృతదేహం సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు కుళ్లిపోయిన మృతదేహం భాగాలుగా స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. స్వాధీనం చేసుకున్న మృతదేహాన్ని ఇంకా గుర్తించలేదని ముంబైకి చెందిన గోరై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో పరిసర ప్రాంతాల్లో భయాందోళన నెలకొంది.

Read Also: Fire At Petrol Pump Station: పెట్రోల్ కొట్టిస్తుండగా కారులో చెలరేగిన మంటలు.. సిబ్బంది చర్యతో?

ముంబై పోలీసులు మాట్లాడుతూ.. మృతదేహం పరిస్థితిని బట్టి చూస్తే.. హత్య కొన్ని రోజుల క్రితం జరిగి ఉండవచ్చని, మృతదేహాన్ని ఇక్కడ పారవేయడం జరిగిందని తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో సీసీటీవీ ఫుటేజ్, సమీపంలోని పోలీస్ స్టేషన్ల నుండి మిస్సింగ్ కేసుల సమాచారం సేకరిస్తున్నారు. ప్రస్తుతం విచారణ ఆధారంగా ఆధారాలు వెతికే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Read Also: Gowtham Gambhir: న్యూజిలాండ్‌తో ఓటమిపై తొలిసారిగా మౌనం వీడిన గంభీర్.. ఏం చెప్పాడంటే?

Exit mobile version