Mahakumbh 2025 : ‘భారత్ చాలా గొప్పది’.. సనాతన ధర్మాన్ని కొనియాడిన విదేశీ భక్తులు (వీడియోలు)
- మహాకుంభమేళా 2025 ప్రారంభం
- పోటెత్తిన భక్త జనం
- విదేశాల నుంచి భారీగా తరలిన భక్తులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహాకుంభమేళా 2025 ఈరోజు నుంచి ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభమైంది. సంగం ఒడ్డుకు భక్తులు, సాధువులు, సాధువులు భారీగా తరలివచ్చారు. పౌష్ పూర్ణిమ సందర్భంగా మహాకుంభ మొదటి ‘షాహి స్నాన్’ నిర్వహిస్తున్నారు. 144 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ అరుదైన ఖగోళ యాదృచ్చికానికి సంబంధించి భక్తుల ఉత్సాహం తారాస్థాయికి చేరుకుంది. ఈ మహాకుంభానికి 15 లక్షల మందికి పైగా విదేశీ పర్యాటకులు వస్తారని అంచనా వేస్తున్నట్లు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. కాగా.. ఇక్కడి వచ్చిన విదేశీ భక్తుల మాటలకు రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. మన దేశ సంస్కృతి, సంప్రదాయాలను వారు కొనియాడుతున్నారు.
#WATCH | Prayagraj | A Russian devotee at #MahaKumbh2025, says, "…'Mera Bharat Mahaan'… India is a great country. We are here at Kumbh Mela for the first time. Here we can see the real India – the true power lies in the people of India. I am shaking because of the vibe of the… pic.twitter.com/vyXj4m4BRs
Also Read
- Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
- CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
— ANI (@ANI) January 13, 2025
ఈ మేళాలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు తరలిరావడం పట్ల విదేశీ భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ దివ్యత్వాన్ని చూసి, ఒక రష్యన్ భక్తురాలు భారతదేశాన్ని కొనియాడింది. మేరా భారత్ మహాన్ అనే స్లోగన్ ఇచ్చింది. “మేము మొదటిసారి కుంభమేళాకి వచ్చాం. ఇక్కడ మనం నిజమైన భారతదేశాన్ని చూడాలి. ఈ పవిత్ర స్థలానికి ఉన్న శక్తితో నేను వణికిపోతున్నాను. నేను భారతదేశాన్ని ప్రేమిస్తున్నాను.” అని ఆమె తెలిపింది.
#WATCH | Prayagraj | A devotee from South Africa's Cape Town at #MahaKumbh2025, says, "It's so beautiful. The streets are clean, the people are so friendly and happy… We practice Sanatan Dharm…" pic.twitter.com/Q5PUnSriuy
— ANI (@ANI) January 13, 2025
ఇక్కడి వాతావరణం అద్భుతంగా ఉందని దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ నుంచి వచ్చిన ఓ భక్తుడు పరిశుభ్రత, ఏర్పాట్లను కొనియాడారు. “రోడ్లు శుభ్రంగా ఉన్నాయి. ప్రజలు చాలా స్నేహపూర్వకంగా ఉన్నారు. మేము సనాతన ధర్మాన్ని అనుసరిస్తాం. ఇక్కడికి రావడం ద్వారా మేము పొందిన అనుభవం మరువలేనిది.” అని తెలిపాడు.
#WATCH | Prayagraj | A devotee from South Africa's Cape Town at #MahaKumbh2025, Nikki says, "It's very very powerful and we are very blessed to be here at river Ganga…" pic.twitter.com/Zv9d8OkQjV
— ANI (@ANI) January 13, 2025
దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ నుంచి మహాకుంభమేళాకి వచ్చిన నిక్కీ అనే భక్తురాలు ఇక్కడి అద్భుతమైన వాతావరణాన్ని చూసి మురిసిపోయింది. తన భావాలను పంచుకుంటూ ఈ అనుభవం చాలా పవర్ ఫుల్ అని తెలిపింది. గంగా నది వద్దకు రావడం ఆశీర్వాదంగా.. అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపింది.
#WATCH | Prayagraj | A Spanish devotee at #MahaKumbh2025, Jose says, "We are many friends here – from Spain, Brazil, Portugal… We are on a spiritual trip. I took holy dip and I enjoyed it much, I am very lucky." pic.twitter.com/YUD1dfBgM4
— ANI (@ANI) January 12, 2025
అదే సమయంలో కుంభ్ చేరుకున్న స్పానిష్ భక్తుడు చాలా మంది స్నేహితులు ఇక్కడికి వచ్చారని చెప్పారు. స్పెయిన్, బ్రెజిల్, పోర్చుగల్ నుంచి చాలా మంది వచ్చినట్లు పేర్కొన్నారు. తాము ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నట్లు తెలిపారు. తాను పవిత్ర స్నానం చేశానని.. పూర్తిగా ఆస్వాదించానన్నారు. నన్ను నేను చాలా అదృష్టవంతుడిగా భావిస్తాను అని తెలిపాడు.
తాజావార్తలు
-
Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
-
Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
-
LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!