ఏపీ హైకోర్టులో చంద్రబాబుపై రాళ్ల దాడి కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లు దాఖలయ్యాయి. ఇదే కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేయగా జిల్లా కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇదే కేసులో ఎమ్మెల్సీ అరుణ్, మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్‌పై కేసు నమోదు అయ్యే ఛాన్స్‌తో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసినట్లు తెలిసింది. ఈ పిటిషన్లపై రేపు హైకోర్టులో విచారణ చేయనున్నారు.
READ MORE: Fancy Numbers Demand : : ఫాన్సీ నెంబర్లకు పెరుగుతున్న క్రేజ్.. ఒక్కరోజులో 52 లక్షల పైచిలుకు బిడ్
2022 నవంబర్ 4న అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో భాగంగా నందిగామలో పర్యటించారు. ఆ రోజు సాయంత్రం 6:30 గంటలకు ఆయన వాహనం గాంధీబొమ్మ సెంటర్ నుంచి మున్సిపల్ కార్యాలయం వైపు వెళ్తుండగా రైతుబజార్ వద్ద రాళ్లదాడి జరిగింది. ఇందులో సీఎస్‌ఓ మధుకు గాయమైంది. చంద్రబాబు పర్యటనకు రెండు రోజుల ముందు నాటి ఎమ్మెల్యే జగన్మోహనరావు, ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్ తమ అనుచరులతో భేటీ అయ్యారు. కాగా.. రెండేళ్ల కిందట ఘటనా స్థలిలో టీడీపీ విడుదల చేసిన చిత్రాల ఆధారంగానే ప్రస్తుతం కేసు చిక్కుముడి వీడింది. ఆ ఫొటోలను క్షుణ్నంగా విశ్లేషించి, నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు.
READ MORE: Rahul Gandhi: రాహుల్ గాంధీ ‘‘పౌరసత్వం’’ రద్దు చేయాలని పిటిషన్..