NTV Telugu Site icon

TDP and Jana Sena: స్పీడ్‌ పెంచిన టీడీపీ-జనసేన.. మొదటివారంలో సీట్ల సర్దుబాటుపై ఉమ్మడి ప్రకటన..?

Babu And Pawan

Babu And Pawan

TDP and Jana Sena: ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ఎన్నికల సన్నద్ధతను మరింత వేగవంతం చేయనున్నాయి తెలుగుదేశం పార్టీ-జనసేన పార్టీ.. వచ్చే నెల మొదటి వారంలో సీట్ల సర్దుబాటుపై ఉమ్మడి ప్రకటనకు అవకాశం ఉందని చెబుతున్నాయి ఇరు పార్టీల వర్గాలు.. ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై రెండు దఫాలుగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్‌ పవన్‌ కల్యాణ్ మధ్య చర్చలు జరిగాయి.. త్వరలో మరోసారి చంద్రబాబు – పవన్ భేటీకి అవకాశం ఉందంటున్నారు.. ప్రస్తుతం హైదరాబాద్‌లో చంద్రబాబు – పవన్ కల్యాణ్‌ ఉన్నారు.. వచ్చే రెండు రోజులు సీట్ల సర్దుబాటు.. అభ్యర్థుల ఖరారు మీదే ఫోకస్ పెట్టనున్నారని తెలుస్తోంది.. సీట్ల సర్దుబాటు కసరత్తు నిమిత్తమే రా..! కదలి రా..!! సభలకు చంద్రబాబు బ్రేక్‌ ఇచ్చారనే చర్చ సాగుతోంది.. ఇప్పటికే 17 పార్లమెంట్ స్థానాల్లో రా..! కదలి రా..!! సభలు పూర్తి చేశారు.. వచ్చే నెల 4వ తేదీ మిగిలిన చోట్ల నుంచి రా..! కదలి రా..!! సభలు నిర్వహించేందుకు చంద్రబాబు ప్లాన్‌ చేస్తున్నారు..

Read Also: Vikarabad: రన్నింగ్‌ ట్రైన్‌ ఎక్కేందుకు ప్రయత్నం.. రైలు- ప్లాట్ ఫారం మధ్యలో ఇరుక్కున్న ప్రయాణీకుడు..

మరోవైపు టీడీపీ-జనసేన మధ్య సీట్ల సర్దుబాటు ప్రకటన జరిగాకే తన పర్యటనలను జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రారంభించనున్నారట.. వచ్చే నెల 4వ తేదీన అనకాపల్లి నుంచి పవన్ కల్యాణ్‌ పర్యటనలు ప్రారంభం కానున్నట్టు ఇప్పటికే జనసేన సంకేతాలు ఇచ్చింది.. అయితే, సీట్ల సర్దుబాటుతో పాటు ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపైనా చంద్రబాబు – పవన్‌ కల్యాణ్‌ తుది కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది.. కాగా, వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించిన టీడీపీ – జనసేన పార్టీలు.. ఇప్పటికే పలు అంశాలపై కీలకంగా చర్చించడం.. కొన్ని అంశాలపై ఉమ్మడి నిర్ణయానికి వచ్చిన విషయం విదితమే.