Site icon NTV Telugu

GHMC: వేడెక్కిన జీహెచ్ఎంసీ రాజకీయం.. ఎల్లుండి సర్వసభ్య సమావేశం

Ghmc E

Ghmc E

జీహెచ్ఎంసీ రాజకీయం వేడెక్కింది. ఎల్లుండి (గురువారం) జీహెచ్ఎంసీలో సర్వసభ్య సమావేశం జరగనుంది. కాగా.. ఫిబ్రవరి 11 తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్ పై అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో.. జీహెచ్ఎంసీలో మేయర్‌తో కాంగ్రెస్ కార్పొరేటర్ల సమావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. మరోవైపు.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కార్పొరేటర్ల సమావేశం నిర్వహించారు. అలాగే.. రేపు బీఆర్ఎస్ అధిష్టానం ఆధ్వర్యంలో గ్రేటర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కార్పొరేటర్ల మీటింగ్ జరుగనుంది.

Read Also: Congo fever: గుజరాత్‌లో ‘కాంగో ఫీవర్’ కలకలం.. 5 ఏళ్లలో తొలి మరణం..

ఇదిలా ఉంటే.. అవిశ్వాసంపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి స్పందించారు. అవిశ్వాసంకు ఎంత మంది కావాలో కూడా బీఆర్ఎస్‌, బీజేపీకి తెలియదని విమర్శించారు. ఫిబ్రవరి 11తో నాలుగేళ్లు పూర్తవుతుంది కాబట్టి ఆ తర్వాతే అవిశ్వాసం పెట్టాలని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కార్పొరేటర్లకు జీహెచ్ఎంసీ యాక్ట్ గురించి తెలియదని పేర్కొన్నారు. ఎంత మెజారిటీతో అవిశ్వాసం నెగ్గుతుందో కూడా తెలియదని విజయలక్షి ఆరోపించారు.

Read Also: Bangladesh: బంగ్లాదేశ్ సైన్యంలో తిరుగుబాటు.. ఆర్మీ చీఫ్‌కి వ్యతిరేకంగా పాక్ అనుకూల వర్గం కుట్ర..?

బీజేపీ, బీఆర్ఎస్‌లు ఈ విషయంపై కౌన్సిల్ మీటింగ్‌లో రాద్ధాంతం చేయాలని చూస్తే ఊరుకోమని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హెచ్చరించారు. ఎల్లుండి జరగబోయే జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్‌లో ప్రజా సమస్యలపై చర్చించాలని తెలిపారు. దీనికి కార్పొరేటర్లు సహకరించాలి.. గొడవలు చేసేందుకు కౌన్సిల్ వేదిక కాదు.. ఇది ఎలక్షన్ ఇయర్, అభివృద్ధి పై కార్పొరేటర్లు దృష్టి పెట్టాలని గద్వాల్ విజయలక్ష్మి పేర్కొన్నారు.

Exit mobile version