నిషేధిత స్టెరాయిడ్స్, ట్యాబ్లెట్లు అమ్ముతున్న ముఠా గుట్టురట్టు చేశారు తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అధికారులు. మెడికల్ షాపు ముసుగులో ముఠా స్టెరాయిడ్స్ సప్లై చేస్తున్నట్లు డ్రగ్ కంట్రోల్ అధికారులు గుర్తించారు. జిమ్ కి వెళ్ళే యువకులే టార్గెట్ గా ఈ ముఠా విక్రయాలు చేస్తున్నట్లు విచారణలో గుర్తించారు అధికారులు. ఆసిఫ్ నగర్, కార్వాన్ లో పెద్ద మొత్తంలో స్టెరాయిడ్స్, ట్యాబ్లెట్లు డ్రగ్ కంట్రోల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆసిఫ్ నగర్, కార్వాన్ కేంద్రంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఠా స్టెరాయిడ్స్ సప్లై చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆసిఫ్ నగర్ కి చెందిన అతిఫ్ ఖాన్, కార్వాన్ కి చెందిన అజిత్ సింగ్ లను దుపులోకి తీసుకున్న డ్రగ్ కంట్రోల్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు స్టెరాయిడ్స్, ట్యాబ్లెట్లు అతీఫ్ ఖాన్, అజిత్ సింగ్ సప్లై చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
Read Also : Perni Nani: తెలియక అపచారం చేస్తే దేవుడు క్షమిస్తాడు.. కానీ, తిరుమల లడ్డూపై విష ప్రచారం..
ఇదిలా ఉంటే.. గత కొన్ని రోజలుగా రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్ కంట్రోల్ అధికారులు అనుమానిత మందుల షాపుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. వారి తనిఖీల్లో ఇప్పటికే నిషేధిత మందులు, ఇన్‌జెక్షన్‌లు భారీ దొరికాయి. అయితే.. జిమ్‌కు వెళ్లే వాళ్లు, బాడీ బిల్డర్లనే లక్ష్యంగా చేసుకునే ఈ దందా సాగుతున్నట్లు తెలుస్తోంది. తక్కువ సమయంలో కండలు పెంచాలనే ఆలోచనతో కొందరు ఈ స్టెరాయిడ్స్ వాడి ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. ఇలాంటి స్టెరాయిడ్స్ వాడి కండలు పెంచాలనుకుంటే.. భవిష్యత్తులో చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని అధికారులు వెల్లడిస్తున్నారు.
Also Read : Hassan Nasrallah: హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతం.. ఇజ్రాయిల్ ఆర్మీ కన్ఫార్మ్..