NTV Telugu Site icon

Viral: పెళ్లిచూపుల్లో ఖాకీ డ్రెస్‌ లో కనపడ్డ యువతి.. అనుమానంవచ్చి విచారించగా..?

14

14

రైల్వే ఎస్ఐ అంటూ చెప్పుకుంటూ చెలామణి అవుతున్న నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన మాళవిక అనే యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ యువతి బండారాన్ని బట్టబయలు చేశారు రైల్వే పోలీసులు. నార్కెట్‌ పల్లికి చెందిన ఈ అమ్మాయి నిజాం కాలేజ్‌ లో డిగ్రీ వరకు చదివింది. ఆ తర్వాత 2018లో ఆర్పిఎఫ్ ఎస్సై పరీక్షకు హాజరైంది. కాకపోతే., పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చినప్పటికీ.. కంటికి ఉన్న సమస్య కారణంతో వైద్య పరీక్షల్లో ఆమె డిస్‌క్వాలిఫై అయింది.

Also Read: Vijay Devarakonda : విజయ్ దేవరకొండ స్టైలే వేరయా..

అయితే తాను ఎలాగైనా సరే రైల్వేలో పోలీసు కావాలనుకున్న ఆమె ఖాకీ యూనిఫామ్‌ ను ధరించింది. ఆపై నార్కెట్‌ పల్లి గ్రామంలో ఆర్పిఎఫ్ ఎస్ఐగా ఆమె చలామణి అవుతూ వచ్చింది. తను శంకరపల్లి ఆర్పీఎఫ్‌ లో విధులు నిర్వహిస్తున్నట్లు నమ్మబలికింది. తరుచూ యూనిఫాంలో ఉన్న ఫోటోలను తన డీపీగా, అలాగే స్టేటస్‌ లో పెట్టుకోవడంతో ఆమెకు తెలిసిన వారు చాలామంది ఆ అమ్మాయి నిజంగానే ఉద్యోగం చేస్తుందని నమ్మారు.

Also Read: Dogs Shootout: పెంపుడు కుక్కని చంపడంతో.. 20 వీధి కుక్కలను అతి కిరాతకంగా..?

ఇక తాజాగా ఆమెకు ఓ పెళ్లి సంబంధం రాగా.. అబ్బాయిని చూసేందుకు సైతం యూనిఫాంలోనే వెళ్లింది. దాంతో ఆమె అసలు తంతు బయటపడింది. పెళ్లి చూపులకు కూడా యూనిఫాంలో రావటంతో అబ్బాయి తరపువాళ్లు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. దాంతో తమకు తెలిసిన రైల్వే అధికారుల ద్వారా ఎంక్వయిరీ చేయించుకున్నారు అబ్బాయి తరపు వారు. ఎంక్వయిరీలో అసలు మాళవిక అనే రైల్వే ఎస్సై లేనే లేదని నిర్ధారణ జరిజినది. దీంతో వాలారు పోలీసులను ఆశ్రయించి అసలు విషయం తెలిపారు. ఆ తర్వాత నల్గొండలో మాళవికను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు రైల్వే పోలీసులు.