టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఒక్క సినిమాతో స్టార్ హీరోగా మారాడు.. అర్జున్ రెడ్డి సినిమా అతడి సినీ కేరీర్ ను పీక్స్ కు తీసుకెళ్ళింది.. ఆ తర్వాత వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు.. రీసెంట్ గా ఖుషి సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. ఆ సినిమా బాగానే ఆకట్టుకుంది.. ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తున్నాడు.. త్వరలోనే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు..
తాజాగా ముంబైలో నిర్వహించిన అమెజాన్ ప్రైమ్ వీడియో ఈవెంట్ లో మెరిసాడు.. ఈ సందర్బంగా బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ స్టేజ్ పైన అర్జున్ రెడ్డి సినిమాను పొగుడుతూ ముద్దు పెట్టిన సంగతి తెలిసిందే.. అందుకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి… ఇప్పుడు తాజాగా విజయ్ దేవరకొండ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
విజయ్ దేవరకొండ ముంబై నుంచి హైదరాబాద్ కు వచ్చేశాడు.. ఎయిర్ పోర్ట్ లో వెళ్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఆ ఫోటోలలో విజయ్ వైట్ అండ్ గ్రీన్ కలర్ షర్ట్ లో, బ్లాక్ లూజ్ పాంట్ లో కనిపించాడు.. అతని డ్రెస్సింగ్ స్టైల్ గురించి అందరికి తెలిసిందే.. ప్రస్తుతం ఈ ఫొటోలో నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.. విజయ్ సినిమాల విషయానికొస్తే.. ఫ్యామిలీ స్టార్ సినిమా చేస్తున్నాడు.. ఏప్రిల్ 5 న సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతుంది..