Site icon NTV Telugu

Uttar Pradesh: యూపీ నుంచి బీహార్ వెళ్తున్న రైలులో అగ్నిప్రమాదం.. క్రాకర్స్ అంటుకోవడంతో..!

Up Train

Up Train

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జంక్షన్‌లో రైలు అగ్ని ప్రమాదానికి గురైంది. బీహార్ వెళ్తున్న దిబ్రూగఢ్-లాల్‌ఘర్ ఎక్స్‌ప్రెస్‌లోని జనరల్ కోచ్‌లో మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు చీఫ్ ఫైర్ ఆఫీసర్ (CFO) చంద్ర మోహన్ శర్మ తెలిపారు. ఓ వ్యక్తి అక్రమంగా పటాకులు తీసుకెళ్లే క్రమంలో సిగరెట్‌ తాగాడని.. దీంతో మంటలు అంటుకున్నట్లు పేర్కొన్నారు.

Read Also: Tiktok Ban in Nepal: భారత్ బాటలోనే నేపాల్.. చైనాకు మరో గట్టి షాక్..

దిబ్రూగఢ్-లాల్‌ఘర్ ఎక్స్‌ప్రెస్‌లోని S2 కోచ్‌లో మంటలు చెలరేగాయని అధికారి చెప్పారు. ఈ కోచ్‌లోని 55, 56 సీట్లలో కూర్చున్న ప్రయాణికుడు అక్రమంగా బాణాసంచా తీసుకెళ్తున్నాడు. అతను సిగరెట్ తాగుతుండగా క్రాకర్స్ కు అంటుకోవడంతో మంటలు చెలరేగాయని CFO తెలిపారు. తమకు సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నామన్నారు. వెంటనే అగ్నిమాపక పరికరాలను ఉపయోగించి మంటలను అదుపులోకి తెచ్చామని చెప్పారు. ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. అయితే ఓ ప్రయాణికుడి మాత్రం స్వల్ప గాయమైనట్లు తెలిపాడు. కోచ్ లో మంటలు వ్యాపించడంతో భయంతో పరుగులు తీయడంతో తలకు గాయమైందని చీఫ్ ఫైర్ ఆఫీసర్ చెప్పారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియల్సి ఉందని పేర్కొన్నారు.

Read Also: RS Praveen Kumar: బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటే.. ఎవరికి ఓటు వేసిన కేసీఆర్ పార్టీకే పోతుంది..

Exit mobile version