NTV Telugu Site icon

Fine To Hotel: హోటల్ లో చట్నీలో వెంట్రుక.. భారీ జరిమానా..

Hotel

Hotel

గత కొన్ని రోజులుగా తరువుచుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు రెస్టారెంట్ల పై, హోటళ్ల పై నిబంధనలకు అనుగుణంగా దాడులు చేస్తున్నారు. ఇందులో భాగంగా పరిశుభ్రత పాటించని హోటళ్ల పై కొరడా ఝళిపిస్తున్నారు ఫుడ్ స్ఫటి అధికారులు. ఇకపోతే తాజాగా వెంట్రుకలతో కూడిన చట్నీని అందించినందుకు హైదరాబాద్ లోని ఈసిఐఎల్, ఏఎస్ రావు నగర్‌లో ఉన్న చట్నీ హోటల్ పై 5,000 జరిమానా విధించబడింది.

Cinnamon water: శరీర బరువు తగ్గేందుకు దాల్చిన చెక్క నీరు..ట్రై చేయండి

ఈసిఐఎల్, ఏఎస్ రావు నగర్‌లో ఉన్న చట్నీస్ హోటల్ వద్ద టిఫెన్ చట్నీలో ఒక వెంట్రుక కనుగొనబడింది. ఈ విషయాన్ని కస్టమర్ మేనేజర్ దృష్టికి తీసుకువెళ్లాడు. అయితే అతను తప్పును ఒప్పుకుని మళ్లీ కొత్త వంటకాన్ని అందించాడు. కాకపోతే ఆ కస్టమర్ మాత్రం దీనిని ‘ఎక్స్’ వేదికగా అధికారులకు షేర్ చేయగా.. వారు చర్యలు తీసుకున్నారు. జీహెచ్‌ఎంసీ అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ రూ. 5,000 జరిమానా విధించారు. అసౌకర్యం, ప్రజా భద్రతకు ప్రమాదం, ఇబ్బంది, HMC చట్టం, 1955లోని పైన పేర్కొన్న సెక్షన్ల ప్రకారం నేరాలకు పాల్పడినందుకు HMC చట్టంలోని సెక్షన్ 674 కింద అధికారాలను వినియోగించుకుని, నేరం రుజువు కావడంతో జరిమానాను విధించారు.

Pradeep K Vijayan: ప్రముఖ నటుడు అనుమానాస్పద స్థితిలో మృతి.. సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం..