NTV Telugu Site icon

AP Crime: విషాదాంతమైన చిన్నారి మిస్సింగ్ కేసు.. కన్న తండ్రే కిరాతకుడు…

Anantapur

Anantapur

AP Crime: కన్న తండ్రే ఓ చిన్నారి పాలిట కాలయముడిగా మారాడు.. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న తన కూతురిని దారుణంగా హత్య చేసినట్టుగా తెలుస్తోంది.. ఈ హృదయ విదారక ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.. అయితే, చిన్నారిని మట్టుబెట్టిన తండ్రి.. ఆ విషయం బయటకు పొక్కవద్దన్న ప్లాన్‌లో భాగంగా.. తన కూతురు కనిపించడం లేదంటూ పోలీసులకు తానే ఫిర్యాదు చేశాడు.. నార్పల మండల కేంద్రంలో నివాసం ఉండే గణేష్.. మూడు రోజుల క్రితం పాఠశాలకు వెళ్లిన తన కూతురు తిరిగి ఇంటికి రాలేదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.. ఇక ఆ ఫిర్యాదును స్వీకరించి మిస్సింగ్‌ కేసు నమోదు చేసిన పోలీసులు.. చిన్నారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.. చివరకు నార్పల మండలం కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఉన్న బావిలో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు.. ఈ కేసులో చిన్నారి తండ్రి గణేష్‌ను పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. అతడే హత్య చేసినట్టు అంగీకరించినట్టుగా తెలుస్తోంది.. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందనే చిన్నారిని చిదిమేసినట్టుగా సమాచారం.

Read Also:WI vs USA: అమెరికాపై ఘన విజ‌యం.. వెస్టిండీస్ సెమీస్‌ అవకాశాలు సజీవం!