NTV Telugu Site icon

Viral Video: భారత జట్టును దగ్గరగా చూడ్డానికి.. ఏకంగా చెట్టెక్కిన అభిమాని!

India Fan

India Fan

A Fan Climb A Tree For Looking Indian Cricket Team Victory Parade: వెస్టిండీస్ గడ్డపై టీ20 ప్రపంచకప్‌ 2024 గెలిచి గురువారం స్వదేశానికి వచ్చిన భారత క్రికెట్‌ జట్టుకు అడుగడుగునా నీరాజనాలు అందాయి. టీమిండియా క్రికెటర్లకు బ్రహ్మరథం పట్టిన ఫ్యాన్స్‌.. పొట్టి ప్రపంచకప్‌ను చూసేందుకు ఎగబడ్డారు. దాంతో జనాలతో ముంబై రోడ్లు కిక్కిరిసిపోయాయి. ముంబైలోని మెరైన్ రోడ్డు అయితే కేరింతలు, చప్పట్లతో దద్దరిల్లిపోయింది. వర్షం కారణంగా కాస్త ఆలస్యంగా మొదలైన రోడ్‌షో.. భారత క్రికెట్ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోయింది.

13 ఏళ్ల ప్రపంచకప్‌ నిరీక్షణకు తెరదించిన భారత జట్టును చూడటానికి, అభినందించడానికి అభిమానులు దేశం నలుమూల నుంచి గురువారం ముంబైకి చేరుకున్నారు. అయితే భారత ఆటగాళ్లను దగ్గరగా చూడాలని ఓ అభిమాని పెద్ద రిస్క్ చేశాడు. మెరైన్ రోడ్డులో రోడ్‌షో జరుగుతుండగా.. ఓ అభిమాని రోడ్డు పక్కనే ఉన్న ఓ భారీ చెట్టు పైకెక్కి ఆటగాళ్లను పలకరించే ప్రయత్నించాడు. చెట్టు కొమ్మపై పడుకుని.. ఓ చేతితో బ్యాలెన్స్ చేసుకుంటూ, మరో చేతితో టీమిండియాను వీడియో తీశాడు. సదరు అభిమాని ఆటగాళ్లను చూసి సంతోషపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read: BRS MLCs In Congress: బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్లో చేరిన ఆరుగురు ఎమ్మెల్సీలు..

ఆ అభిమాని రిస్క్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అదే సమయంలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘లక్కీ ఫెల్లో.. టీ20 ప్రపంచకప్‌ను దగ్గరనుండి చూశాడు’, ‘నీ ధైర్యానికి హ్యాట్సాఫ్ బ్రో’, ‘ఎవడ్రా వీడు.. ఇంత టాలెండె‌డ్‌గా ఉన్నాడు’ అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెట్టారు. జూన్ 29న జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను భారత్ 7 వికెట్ల తేడాతో ఓడించి విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే.

Show comments