NTV Telugu Site icon

Suicide Attempt: సూసైడ్‌ చేసుకోవడానికి వచ్చి రైలు పట్టాలపై నిద్ర పోయిన యువతి..(వీడియో)

Train Incident

Train Incident

Suicide Attempt: బీహార్‌ లోని మోతీహరిలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. తాను చనిపోవాలని రైల్వే ట్రాక్‌పై పడుకున్న బాలిక గాఢనిద్రలోకి జారుకుని అక్కడే పడుకుండి పోయింది. మరోవైపు అదే ట్రాక్ మీదుగా వెళ్తున్న రైలును లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేసి ఎలాగోలా ఆపేశాడు. అదృష్టవశాత్తూ ఎలాగోలా బాలిక ప్రాణానికి ఎటువంటి ఆటంకం కలగలేదు. ఈ ఘటన మోతీహరి లోని చకియా రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. ఓ బాలిక ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో వచ్చి రైలు కోసం రైల్వే ట్రాక్‌పై నిరీక్షిస్తూ అక్కడే నిద్రపోయింది.

Answer Sheet Evaluation: వినూత్న ప్రయోగం.. తమిళనాడులో ఏఐతో పరీక్షా పత్రాల మూల్యాంకనం..

మరోవైపు రైల్వే ట్రాక్‌పై పడి ఉన్న బాలికను చూసిన లోకో పైలట్ (Loco Pilot) ఎమర్జెన్సీ బ్రేకులు వేశాడు. అచ్చం సినిమా సీన్ లో లాగా రైలు కూడా ట్రాక్ పై పడుకున్న అమ్మాయి దగ్గరకు వచ్చి ఆగింది. ఆ తర్వాత లోకో పైలట్ త్వరగా రైలు క్యాబిన్ నుండి దిగివచ్చి బాలికను నిద్ర నుండి మేల్కొలిపి, ట్రాక్స్ సమీపంలో నివసిస్తున్న స్థానిక ప్రజల సహాయంతో ఆమెను పట్టాలపై నుండి తప్పించాడు. స్థానిక మహిళలు ఆమెను రైల్వే ట్రాక్‌పై నుండి ఎత్తుకుని ఒడ్డుకు తీసుకెళ్లడం చేస్తున్నపుడు, ఆ అమ్మాయి కేకలు వేయడం ప్రారంభించింది. ‘మీకు ఏమైంది..? నన్ను వదిలెయ్.. వదిలేయండి. నేను చావాలి…చావాలి’ అంటూ అరవసాగింది. అయితే, ఆ స్థానిక మహిళలు బలవంతంగా లాక్కొని వెళ్లి బాలికను సురక్షితంగా తన ఇంటికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

Show comments