Site icon NTV Telugu

Doctor Died: అమెరికాలో తెనాలికి చెందిన వైద్యురాలు మృతి.. మృతదేహం కోసం కుటుంబం ఎదురుచూపులు

Accident

Accident

Doctor Died: అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వెటర్నరీ డాక్టర్ జెట్టి హారిక(25) మృతి చెందింది. ఆమె మృతితో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహం కోసం భారత రాయబార కార్యాలయం వద్ద ఎదురుచూపులు చూస్తున్నారు. మంత్రి లోకేష్ స్పందించాలని, తమ కూతురు మృతదేహాం భారత్‌కు త్వరగా వచ్చేలా చూడాలని విన్నవించుకుంటున్నారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన జెట్టి హారిక అమెరికాలోని ఓక్లహోమా స్టేట్‌లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. హారిక తండ్రి దేవాదాయ శాఖ ఉద్యోగిగా పని చేస్తున్నారు. ఆమె తల్లిదండ్రులు జెట్టి శ్రీనివాసరావు, నాగమణి. హారిక ఏడాదిన్నర క్రితం వెటర్నరీలో ఉన్నత చదువులు కోసం అమెరికా వెళ్ళింది. ఆమె మృతదేహాన్ని స్వస్థలానికి తెచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ చొరవ తీసుకొని హారిక మృతదేహాన్ని తెనాలికి వచ్చేందుకు సహకరించాలని విన్నవించుకుంటున్నారు. హారిక మరణ వార్త విని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.

Read Also: AP Assembly: రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. తొలి రోజు గవర్నర్‌ ప్రసంగం

Exit mobile version