Site icon NTV Telugu

Nellore: ఆస్పత్రి భవనంపై నుంచి దూకి వైద్యురాలు ఆత్మహత్య..

New Project (14)

New Project (14)

నెల్లూరులోని ప్రభుత్వ వైద్య కళాశాల భవనం నుంచి దూకి ఒక వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడింది. చేజర్ల మండలం చిత్తలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యురాలిగా పనిచేస్తున్న జ్యోతి … క్యాన్సర్ కు సంబంధించి జిల్లా వ్యాప్తంగా వైద్యులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమానికి హాజరైంది. ఇందులో భాగంగా ఆమెతో పాటూ 11 మంది వైద్యులు శిక్షణకు హాజరయ్యారు. హఠాత్తుగా జ్యోతి భవనం పైనుంచి పడిపోవడంతో… అక్కడ ఉన్న సిబ్బంది వెంటనే ఆమెను ఆసుపత్రి వద్దకు తీసుకెళ్లారు. అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. జ్యోతి భర్త రవిబాబు కూడా ప్రభుత్వ వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ చేపట్టారు.. జ్యోతి ఆత్మహత్య చేసుకుందా లేదా ప్రమాదవశాత్తు పడిందా అనే విషయం పోలీసుల విచారణలో వెళ్లడవుతుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పెంచలయ్య తెలిపారు.

READ MORE: Ram Prasad Reddy: అయిదేళ్లలో పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెడతాం

Exit mobile version