NTV Telugu Site icon

Health Tips: ఇంట్లోనే సర్వరోగ నివారిణి.. వాటితో ఆరోగ్య సమస్యలకు చెక్..!

Health

Health

చాలామంది రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. అయితే కొన్ని ఆరోగ్య సమస్యలకు డాక్టర్ల దగ్గరకు పోకుండా.. మెడిసిన్స్ వాడకుండా ఇంట్లోనే నయం చేసుకోవచ్చు. మన వంటగదిలో ఉండే మెంతులు, వాము, నల్ల జీలకర్రతో సర్వ రోగ నివారిణిగా ఈ పదార్థాలు పనిచేస్తాయి. వీటన్నింటిని కలిపి ఒక పొడిలా తయారు చేసుకొని ఒక సీసాలో నిల్వ చేసుకుని ప్రతిరోజు దీనిని ఉపయోగించామంటే చాలా అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు.

Read Also: Minister Vidadala Rajini: ఎన్‌ఎంసీ కొత్త నిబంధనలు సడలించండి.. కేంద్రమంత్రికి విడదల రజినీ వినతి

250 గ్రాముల మెంతులు, 50 గ్రాములు నల్ల జీలకర్ర, 100 గ్రాముల వామును కలిపి వేరువేరుగా పెనంపై కొద్దిగా వేపి పొడిగా చేసుకుని గాలి పోయే వీలులేని సీసాలో నిల్వ చేసుకోవాలి. ఇక ఆ పొడిని ప్రతి రోజు అన్నం తిన్న తర్వాత ఒక గ్లాసు వేడి నీళ్లలో ఒక స్పూను చూర్ణాన్ని కలిపి తాగాలి. ఇది తాగిన తర్వాత ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు. ప్రతి రోజు ఇలా చేయడం వలన శరీరంలో పేరుకుపోయిన విషపదార్థాలు మల,మూత్ర, చెమటల ద్వారా బయటకు వెళ్లిపోతాయి.

Read Also: Chiyaan Vikram: ఆ డైరెక్టర్ తో విక్రమ్ కొత్త సినిమా..?

రెండునెలలపాటు క్రమం తప్పకుండా ఈ పొడిని నీళ్లలో కలుపుకుని తాగడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇక మూడు నెలలు ప్రతిరోజు ఈ చూర్ణాన్ని వాడితే ఆరోగ్యానికి తిరుగుండదని చెబుతున్నారు. ఈ చూర్ణాన్ని వాడిన తర్వాత శరీరంలోని అదనపు కొవ్వు మొత్తం కరిగిపోయి, ఇది రక్తాన్ని శుభ్రపరుస్తుంది. దీనివల్ల శరీరంలో మంచి రక్తం ప్రవహిస్తుంది. శరీరం పై ఉన్న ముడతలు పోయి.. శరీరం యవ్వనంగా కనిపిస్తుంది. అంతేకాకుండా.. శరీరం బలంగాను, చురుకుగాను, ప్రకాశవంతంగానూ మారుతుంది.

NOTE: ఇంటర్నెట్ లో దొరికిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము.. ప్రయత్నించేముందు.. సంబంధిత నిపుణుల సలహాలు పాటించగలరని మనవి.. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీ తెలుగు. కామ్ బాధ్యత వహించదు..