The Indrani Mukerjea Story: Buried Truth : ఓటీటీలో దూసుకెళ్తున్న క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓటీటీ ప్రేక్షకులు డాక్యుమెంటరీ సిరీస్‍లపై ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు.. ముఖ్యంగా సంచలన కేసుల ఆధారంగా రూపొందిన క్రైమ్ సిరీస్‍లకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది.ఈ క్రమంలో ‘ది ఇంద్రాణి ముఖర్జియా: బరీడ్ ట్రూత్’ డాక్యు సిరీస్‍కు భారీగా వ్యూస్ దక్కుతున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనమైన షీనా బోరా హత్య కేసుపై ఈ సిరీస్ రూపొందింది. ఈ సిరీస్ ఆద్యంతం ఉత్కంఠగా ఉండడంతో నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో దూసుకెళుతోంది.ది ఇంద్రాణి ముఖర్జియా: బరీడ్ ట్రూత్ సిరీస్‍పై మొదటి నుంచే చాలా మందికి ఆసక్తి నెలకొంది. కోర్టులో కేసుల వల్ల ఆలస్యమైనా ఎట్టకేలకు ఈ సిరీస్ ఫిబ్రవరి 29వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ప్రారంభం నుంచి మంచి ఆదరణ దక్కించుకుంటోంది.. భారత్‍తో పాటు కెనడా, ఆస్ట్రేలియా సహా సుమారు 18 దేశాల్లో ఈ సిరీస్ ట్రెండ్ అవుతోంది. నెట్‍ఫ్లిక్స్ గ్లోబల్ ట్రెండింగ్‍లో టాప్-7లో ఈ సిరీస్ నిలిచింది. వారంలోనే ఈ డాక్యు సిరీస్‍కు 2.2 మిలియన్లపైగా వ్యూస్ వచ్చాయి. 6.9 మిలియన్ వాచ్ హవర్స్ ను దక్కించుకుంది. మొత్తంగా అంచనాలకు మించి ‘ది ఇంద్రాణి ముఖర్జియా: బరీడ్ ట్రూత్’ డాక్యు సిరీస్ దుమ్మురేపుతోంది. షీనా బోరా హత్య కేసులో చాలా ట్విస్టులు ఉండడం, దాన్ని ఈ సిరీస్‍లో ఎఫెక్టివ్‍గా చూపించడంతో భారీ ఆదరణ దక్కించుకుంటోంది..
షీనా బోరా కేసు విచారణ దశలో ఉండటంతో ఈ సిరీస్‍ను ఆపాలని కోర్టుకు వెళ్లింది సీబీఐ. కింది కోర్టు నిరాకరించడంతో సీబీఐ బాంబే హైకోర్టుకు కూడా వెళ్లింది. ముందుగా సీబీఐ అధికారులకు స్క్రీనింగ్ తర్వాత.. ఈ సిరీస్ ఎట్టకేలకు నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో అడుగుపెట్టింది. వారం ఆలస్యంగా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది.షీనా బోరా మర్డర్ కేసు దేశాన్ని కుదిపేసింది. 2012 ఏప్రిల్‍లో షీనా హత్యకు గురయ్యారు. అయితే, మూడేళ్ల తర్వాత 2015లో ఈ హత్య ఉదంతం బయటికి వచ్చింది. వేరే కేసులో పట్టుడిన ఇంద్రాణి ముఖర్జియా డ్రైవర్ ఈ హత్య గురించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో షీనా హత్య వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో షీనా బోరా తల్లి ఇంద్రాణి ముఖర్జియాను 2015లో అరెస్టు చేయడం సంచలనంగా మారింది.షీనా బోరా హత్య కేసును సీబీఐ విచారిస్తోంది.
Also Read
- Delhi-NCR Earthquake: ఢిల్లీ సహా ఉత్తర భారత్‌లో భూకంపం.. ప్రకంపనలు వచ్చినప్పుడు ఏం చేయాలో తెలుసా?
- Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
- Astrology: అక్టోబర్ 07 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్‌న్యూస్..
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
తాజావార్తలు
-
Delhi-NCR Earthquake: ఢిల్లీ సహా ఉత్తర భారత్‌లో భూకంపం.. ప్రకంపనలు వచ్చినప్పుడు ఏం చేయాలో తెలుసా?
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Astrology: అక్టోబర్ 07 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్‌న్యూస్..
-
World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!