NTV Telugu Site icon

Couple Died: అనుమానాస్పద స్థితిలో దంపతులు మృతి.. బలవన్మరణమా.. విభేదాలు కారణమా..?

Ap

Ap

దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన రాజమండ్రిలో చోటు చేసుకుంది. బలవన్మరణానికి పాల్పడారా.. లేక విభేదాల కారణంగా భార్యను హతమార్చి భర్త ఉరేసుకున్నాడా అన్నది తేలాల్సి ఉంది. వివరాల్లోకి వెళ్తే.. కాకినాడ జిల్లా జగ్గంపేట ప్రాంతానికి చెందిన చక్రవర్తుల శ్రీధర్(28)కు అదే జిల్లా ప్రత్తిపాడు మండలం ఒమ్మంగికి చెందిన దేవి(24)తో ఎనిమిదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి బాబు (7) పాప(6). ఈ కుటుంబం మూడేళ్ల కిందట రాజమండ్రి వచ్చి ఆనందనగర్ లో ఉంటోంది. శ్రీధర్ తాపిమేస్త్రీ. రెండేళ్లకు దంపతుల మధ్య విభేదాలు మొదలయ్యాయి. దీంతో దేవి పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లి తల్లిదండ్రుల వద్దే కొంతకాలంగా ఉంటోంది.

Turbulence: ఖతార్ ఎయిర్‌వేస్ విమానంలో కుదుపులు.. 12 మందికి గాయాలు..

వారం కిందట శ్రీధర్ అత్తారింటికి వెళ్లి వారితో మాట్లాడి పిల్లలను అక్కడే ఉంచి, భార్యను తీసుకుని రాజమండ్రి వచ్చాడు. స్థానిక బంధువు ఒకరు శ్రీధర్ ఇంటి వచ్చి అతడ్ని పిలిచేసరికి ఎటువంటి స్పందన లేదు. కిటికిల్లోంచి చూసేసరికి శ్రీధర్ ఫ్యానుకు ఉరేసుకుని కనిపించాడు. వెంటనే పోలీసులుకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి పరిశీలించారు. దేవి మెడకు చున్నీ బిగిసిపోయి గదిలో పడి మృతి చెంది ఉంది. శ్రీధర్ సీలింగ్ ఫ్యానుకు వేలాడుతూ మృతి చెంది ఉన్నాడు. ఇద్దరూ బలవన్మరణానికి పాల్పడి ఉంటే ఒకరు నేలపై, మరొకరు ఫ్యానుకు వేలాడుతూ ఎలా ఉంటారనే అనుమానం పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి రాజమండ్రి మూడో పట్టణ సీఐ ప్రసన్న వీరయ్యగౌడ్ దర్యాప్తు చేస్తున్నారు.

Heatwave: ఏపీ ప్రజలకు అలర్ట్.. రేపు ఈ మండలాల్లో తీవ్ర వడగాల్పులు

ఉదయం రాజమండ్రి వచ్చిన శ్రీధర్ భార్యను ఇంట్లో దించి గంట తరువాత ఓ మద్యం సీసా తీసుకుని తిరిగి ఇంట్లోకి వెళ్లినట్లుగా స్థానికులు పోలీసులుకు వివరించారు. మద్యం మత్తులో శ్రీధర్ ఈ ఘాతుకం తలపెట్టాడా.. కావాలనే ఇద్దరూ బలవన్మరణానికి పాల్పడ్డారా అన్నది తేలాల్సి ఉంది. అమ్మానాన్న మృతితో ఇద్దరు చిన్నారులు ఒంటరయ్యారు. తల్లిదండ్రులు మృతదేహాలు వద్ద చిన్నారులు కంట తడపెట్టడం చూసి స్థానికులు కన్నీటి పర్యంతం అయ్యారు.