NTV Telugu Site icon

Cheating Lady : నిత్య పెళ్లి కూతురు.. 40 ఎళ్ళ దాటినా పెళ్ళి కాని ప్రసాద్ లే సంధ్య మెయిన్ టార్గెట్ …

Cheating Lady

Cheating Lady

తాజాగా తమిళనాడు రాష్ట్రంలో ఓ నిత్య పెళ్లికూతురు సంబంధించిన ఉదాంతం బయటకు వచ్చింది. ఓ మహిళ ఇప్పటివరకు 50 మందిని పెళ్లి చేసుకొని ఆపై ఎవరికి చెప్పకుండా అందిన కాడికి డబ్బు, నగలతో ఉడాయించేది. అయితే తాజాగా ఓ వ్యక్తిని కూడా ఇలా చేయడానికి ప్రయత్నం చేయగా అనుమానం వచ్చిన అతడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఒకసారి పరిశీలిస్తే..

Heavy Rains : హిమాచల్ నుంచి అస్సాం వరకు వరద బీభత్సం.. యూపీలో 13 మంది మృతి

తమిళనాడులో 50 మందిని పెళ్లి చేసుకున్న ఓ నిత్య పెళ్లికూతురు ఉదాంతం వెలుగులోకి రావడంతో ప్రజల ఆశ్చర్యపోతున్నారు. అసలు విషయం ఏమిటంటే.. ఈ నిత్య పిల్ల కూతురు యువకులు, వ్యాపారవేత్తలతో పాటు, మాములు వ్యక్తులతో పాటు ఏకంగా పోలీస్ లలో ముగ్గురిని కూడా ఇలా మోసం చేయడంతో ఇప్పుడు ఈ విషయం వైరల్ గా మారింది. ఓ డిఎస్పి, ఓ ఎస్ ఐ లాంటి స్థానాల్లో ఉన్న పోలీసులను కూడా ఈవిడ బురిడీ కొట్టించింది. తాజాగా తమిళనాడు రాష్ట్రంలోని తిరుపూర్ ప్రాంతానికి చెందిన 35 సంవత్సరాల యువకుడికి పెళ్లి కాకపోవడంతో వారు పెళ్లికూతురు కోసం అనేక వెబ్సైట్లో శోధిస్తున్నారు. ఇదే సమయంలో ” ద తమిళ్ వే ” అనే వెబ్సైట్ ద్వారా సంధ్య అనే మహిళను పరిచయం చేసుకొని వివాహం చేసుకున్నాడు. ఈ విషయంలో పెళ్ళికొడుకు తండ్రి తల్లి తండ్రులు కూడా అతనికి మద్దతుగా నిలిచారు. అయితే ఈ విషయంపై మొదటి రాత్రి తర్వాత సంధ్య ప్రవర్తనలో తేడా రావడంతో ఆవిడ ఆధార్ కార్డును పరిశీలించారు భర్త కుటుంబ సభ్యులు. అక్కడ ఆధార్ కార్డులో వయసుతోపాటు తన భర్త పేరు ఉండడంతో ఆశ్చర్యపోయిన సదరు యువకుడు, తల్లిదండ్రులు వెంటనే విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు అందించారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు పూర్తి వివరాలను తెలిపారు.

Sim Cards : సిమ్ కార్డులను ఇష్టమొచ్చినట్లు వాడేస్తున్నారా.. జైలుకు పోతారు జాగ్రత్త

ఇందులో భాగంగానే.. ఆవిడ అనేకమందితో వివాహం జరిగిన తర్వాత మొదటి రాత్రి గడిచాక వారితో గొడవపడి ఇంట్లోనే డబ్బులు అలాగే నగలతో పరారు అవుతుందని పోలీసులు కనుగొన్నారు. ఇలా జరిగిన తర్వాత కుటుంబ పరువు పోతుందని ఆమెతో పెళ్లి జరిగిన వ్యక్తుల కుటుంబ సభ్యులు మౌనంగా ఉండిపోతున్నారు. ఒకవేళ ఆ విషయం పై ప్రశ్నిస్తే నగ్నంగా ఉన్న ఫోటోలను బయటపెడతానని బెదిరింపులకు దిగేదని., అలా ఏకంగా 50 మంది వరకు మోసం చేసిందని పోలీసులు తెలిపారు. అయితే ఇలా మోసం చేస్తున్న సమయంలో ఒక్కో పెళ్లికి.. ఒక్కొక్క పేరుతో సంధ్య మగవారిని బుట్టలో వేసుకునేదని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం తిరుపూరు పోలీసుల అదుపులో సంధ్య ఉంది.

Show comments