NTV Telugu Site icon

Chintamaneni Prabhakar: చింతమనేని ప్రభాకర్, అతని అనుచరులపై కేసులు

Chintamaneni

Chintamaneni

Chintamaneni Prabhakar: తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, అతని అనుచర్లపై ఏలూరు జిల్లా పెదవేగి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.. కష్టడిలో ఉన్న ముద్దాయిని దౌర్జన్యంగా తీసుకెళ్లారంటూ చింతమనేని, అతని అనుచరులపై కేసు నమోదు చేశారు పోలీసులు.. చింతమనేని , అతని అనుచరులపై Cr. No. 189/2024 u/s 224, 225, 353, 143 r/w 149 IPC కేసులు పెట్టారు.. అయితే, పెదవేగి పోలీస్ స్టేషన్‌లో నిన్న పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు చింతమనేని.. కొప్పులవారిగూడెంలో ఎలక్షన్ రోజున బూత్ లో కత్తెరతో దాడి చేసిన రాజశేఖర్ అనే టీడీపీ కార్యకర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. దాడిలో గాయపడిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త రవి పోలీసులకు ఫిర్యాదు మేరకు అతన్ని స్టేషన్‌లో ఉంచారు సీఐ.. అయితే, విషయం తెలుసుకుని పెదవేగి పోలీస్‌ స్టేషన్‌లో ఉన్న టీడీపీ కార్యకర్తను బయటకు తీసుకొచ్చి తనకారులో చింతమనేని ప్రభాకర్ తీసుకెళ్లారట.. స్టేషన్‌లో ఉన్న వ్యక్తిని తన అనుమతి లేకుండా ఎలా తీసుకెళ్తారు అంటూ చింతమనేనితో వాగ్వాదానికి దిగారు సీఐ కొండవీటి శ్రీనివాస్.. అయినా.. అతడిని చింతమేని ప్రభాకర్‌ తీసుకెళ్లడంతో.. ఇప్పుడు కేసులు నమోదు చేశారు.. విడియో సాక్షాలు ఆధారంగా త్వరలో వారిని కూడా అరెస్ట్ చేస్తామన్న డీఎస్పీ లక్ష్మయ్య పేర్కొన్నారు.

Read Also: Theaters Closed: రోజుకు 4 వేలు కూడా రావడం లేదు: విజయేందర్ రెడ్డి