NTV Telugu Site icon

Snake In Car: వామ్మో.. రోడ్డు పై వేగంగా వెళ్తున్న కారు.. కాకపోతే కారు కింద చూస్తే.. షాకింగ్ వీడియో..

Viral Video Snake

Viral Video Snake

అనుకోని పరిస్థితుల్లో లేదా పార్క్ చేయబడిన వాహనాల వద్ద కొన్నిసార్లు ఊహించిన దృశ్యాలు చూడవచ్చు. ఒక్కోసారి కొండచిలువలు, పాములు వంటి జీవులు హఠాత్తుగా వాటి దగ్గర ప్రత్యక్షమవుతాయి. ఇలాంటి వింత ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇకపోతే తాజగా ఓ రోడ్డుపై అత్యంత వేగంతో కారు వెళ్తున్నపుడు ఓ షాకింగ్ దృశ్యం కనిపించింది. కారు రోడ్డు పై ప్రయాణిస్తున్న సమయంలో కారు కింద భాగాన అనుకోని సంఘటన జరిగింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు.

Also read: AP Pensions: ఏపీలో కొనసాగుతున్న పెన్షన్ కష్టాలు.. ఎండలో బ్యాంకుల వద్ద క్యూలు

అమెరికాలోని అలబామాలోని హైవేపై ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణిస్తున్న మరో కారు కింద దిగ్భ్రాంతికరమైన దృశ్యాన్ని అందులో ఉన్నవారు చూశారు. ఓ పెద్ద కొండచిలువ కారు కింద నుంచి తలను బయటకు తీసి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తోంది. కారు అతివేగం కారణంగా బయటకు వచ్చిన దిగి వెళ్ళడానికి భయపడుతున్నట్లు అర్థమవుతుంది. కొండచిలువ రోడ్డుపై వివిధ ప్రదేశాలను చూస్తూ., ” అరే నేను ఇప్పుడు ఇలా ఇరుక్కుపోయాను ఏంటి.?, నేను ఎలా తప్పించుకోగలను..? అనుకుంటూ కార్ కింద వేలాడుతుంది.

Also read: Asuraguru: ‘ఆహా’లో క్రైమ్ థ్రిల్లర్ ‘అసురగురు’.. ఇంట్రెస్ట్ పెంచేస్తున్న ట్రైలర్

ఈ ఘటన మొత్తాన్ని మరో కారులో ఉన్న వ్యక్తులు చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. కొందరేమో.. ఈ కొండచిలువ కారులోకి ఎలా వచ్చింది? అని కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరైతే.. కారు ఆపురోయ్.. అది దిగుతుంది అని కామెంట్స్ చేస్తున్నారు.

Show comments