Train Incident: ఈ మధ్యకాలంలో తరచూ కొన్ని రైలుకు సంబంధించిన ఘటనలు జరుగుతున్నాయి. రైలు యాక్సిడెంట్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యాయి. అంతే కాకుండా కొందరు సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి రైలు ఎంచుకొని అందులో డాన్సులు, కొట్లాటలు, డేంజర్ స్టంట్స్ లాంటి సంఘటన సమయంలో అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఓ బాలుడు ఏకంగా నిలిచి ఉన్న ఎక్స్ప్రెస్ రైలు ఇంజన్ పైకి ఎక్కి హాల్చల్ చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Manu Bhaker: వారందరికీ కృతజ్ణతలంటున్న భారత ఒలంపిక్ విజేత..
ఈ వైరల్ వీడియోలోని ఘటన బాపట్ల రైల్వే స్టేషన్ లో జరిగింది. గూడూరు నుంచి విజయవాడ వెళుతున్న ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలు బాపట్ల రైల్వే స్టేషన్ కు వచ్చి ఆగగా.. అప్పటివరకు ప్లాట్ఫారంపై ఉన్న బాలుడు ఒక్కసారిగా రైలు ఇంజన్ బోగి పైకి ఎక్కి హాల్చల్ చేశాడు. దీంతో ఈ ఘటన నేపథ్యంలో అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. ప్లాట్ ఫామ్ పై ఉన్న ప్రజలు అలాగే రైల్లో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు ఒకసారిగా పెద్దగా కేకలు వేస్తూ అతడిని రైలు దిగాలంటూ పిలిచారు. ఇకపోతే ఈ ఘటనలో వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. ఆ తర్వాత రైల్వే పోలీసులు రంగంలోకి వచ్చి అతి కష్టం మీద రైలు ఎక్కిన అబ్బాయిని కిందకు దించారు. దింతో అక్కడి వారందరూ ఊపిరి పీల్చుకున్నట్లు అయింది. ఇకపోతే రైలు పైకెక్కిన బాలుడికి మతిస్థిమితం సరిగా లేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో రైల్వే సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించడంతో పిల్లాడి ప్రాణాలు కాపాడగలిగారు.