ఒడిశాలో శుక్రవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రూర్కెలాలోని హేమ్‌గిర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉస్తాలీ వ్యాలీలో ప్రమాదవశాత్తు బొలెరో వాహనం లోయలో పడింది. ఈ ఘటనలో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళా కార్మికులు అక్కడికక్కడే మరణించారు.. వాహనం డ్రైవర్ సహా మరో ఏడుగురికి గాయలయ్యాయి. ఉదయం కూలీలు పనులకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Read Also: Israel: బందీలను విడిచే దాకా ఎలాంటి ఒప్పందం ఉండదు.. దాడులు ఆపబోం..
శుక్రవారం ఉదయం దుడుకలోని బాలాజీ నిర్మాణ స్థలంలో పని చేసేందుకు తొమ్మిది మంది కార్మికులు వాహనంలో వెళ్తున్నారు. సుమారు 8 గంటల సమయంలో వాహనం ఉస్తాలీ లోయ గుండా వెళుతుండగా ఉన్నట్టుండి డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో.. వాహనం లోయలో పడిపోయింది. ఈ క్రమంలో.. అందులో ప్రయాణిస్తున్న తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను చికిత్స కోసం హేమ్‌గిర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఇద్దరు మహిళా కార్మికులు చికిత్స పొందుతూ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.
Read Also: Mehreen : బీచ్ లో బికినీతో రెచ్చిపోయిన మెహ్రీన్.. పిక్స్ వైరల్..
మృతుల్లో సెమ్లై గంధర్వ, మోతీ గంధర్వ ఉన్నారు. హేమ్‌గిర్ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం తీవ్రంగా గాయపడిన కార్మికులను చికిత్స నిమిత్తం సుందర్‌గఢ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న హేమగిరి పోలీసులు.. ఆస్పత్రికి చేరుకున్నారు. కాగా.. మృతులకు పరిహారం ఇవ్వాలని కోరుతూ బంధువులు, స్థానికులు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. పోలీసులు వారిని శాంతింపజేసి పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు.
