ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శ్రీకాంత్ బొల్లా జీవితాన్ని ఆధారంగా చేసుకుని బాలీవుడ్ లో ఓ సినిమా రూపొందింది. రాజ్ కుమార్ రావు హీరోగా నటించిన శ్రీకాంత్ చిత్రం నుండి తాజాగా ఓ టీజర్ రిలీజ్ అయింది. ఈ సినిమాకు గాను తుషార్ హీరా నందిని దర్శకత్వం బాధ్యతలు చేపడుతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ జ్యోతిక, ఆలయ ఎఫ్ లు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మే 10న విడుదల అవుతోంది. ఈ సినిమాలో కంటి చూపు లేక ఎంతో ఇబ్బంది పడి అనేక సవాళ్లను ఎదుర్కొని ఉన్న చదువుతోపాటు అనేక విజయాలు సాధించిన వ్యక్తిగా శ్రీకాంత్ బోల్ల గురించి సినిమా తీర్చిదిద్దారు. ఇకపోతే అసలు ఎవరు ఈ శ్రీకాంత్.. ఆయన ఏమి సాధించాడు అన్న విషయాలు చూస్తే..
ఈయన 1991 సంవత్సరంలో కంటి చూపు లేకుండా జన్మించాడు. దాంతో వారి కుటుంబ సభ్యులు పుట్టిన వెంటనే అతనిని వదిలించుకోవాలని వారి తల్లిదండ్రులకు సలహా ఇచ్చారు. కాకపోతే వారి తల్లిదండ్రులు మాత్రం ఆయనను పట్టుదలతో చదివించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తోటి విద్యార్థులతో కళ్ళు సరిగా కనిపించని లాంటి అనేక సూటిపోటి మాటలతో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఈయన సొంత ఊరు ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నం. అతడు వ్యవసాయ కుటుంబంలో జన్మించిన తనకు కంటి చూపు లేని ప్రతికూలతను అనుకూలంగా మార్చుకొని కష్టపడి చదివి అమెరికాలోని ఎంఐటి నుంచి గ్రాడ్యుయేషన్ చేసిన తొలి అంతర్జాతీయ అందరి విద్యార్థిగా చరిత్ర లిఖించాడు.
అయితే ఇతను చదువుకుంటున్న సమయంలో పదవ తరగతి పూర్తి అయ్యాక 12వ తరగతిలో సైన్స్ సబ్జెక్టులో తీసుకోవాలని ఆయన భావించారు. కాకపోతే ఆయన అంధుడు కావడంతో కొన్ని నిబంధనల కారణంగా సైన్స్ సబ్జెక్టుకు సంబంధించి అడ్మిషన్ దొరకలేదు. ఇక ఈ విషయంపై కోర్టును ఆశ్రయించిన ఆయనకు ఆరు నెలల తర్వాత సైన్స్ సబ్జెక్టు చదివేందుకు కోర్టు అనుమతించింది. ఆ తర్వాత శ్రీకాంత్ 98 శాతం మార్కులతో టాపర్గ గా నిలిచాడు. ఆ తర్వాత ఐఐటీలో చదవాలనుకున్న అంధుడు కావడం కారణంతో అతనికి అడ్మిషన్ లభించలేదు. ఇకపోతే ప్రస్తుతం శ్రీకాంత్ ఓ పారిశ్రామికవేత్తగా కొనసాగుతున్నారు. హైదరాబాదులోని బొల్లాంట్ ఇండస్ట్రీస్ అనే సంస్థను స్థాపించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. అమెరికాలో ఆయనకు పెద్ద పెద్ద కార్పొరేట్ ఉద్యోగ అవకాశాలు లభించిన తన ఆవిష్కరణలు భారత్ లోనే చేసేందుకు నిర్ణయం తీసుకున్నాడు.
Also read: Yanamala Ramakrishnudu: ఎన్నికల కోడ్ ఉండగానే రూ.20 వేల కోట్ల అప్పు..! యనమల ఆరోపణ
ఈ నేపథ్యంలో 2012లో శ్రీకాంత్ స్థాపించిన బొల్లాంట్ ఇండస్ట్రీస్ కి ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా కూడా ఫండింగ్ చేసి ఆదుకున్నారు. ఈ సంస్థ మొక్కల ఆధారంగా కంపెనీ ప్రాడెక్ట్లను తయారు చేస్తుండగా.. కొన్ని వందల మంది దివ్యాంగులకు తన సంస్థలో శ్రీకాంత్ ఉపాధి కల్పిస్తున్నాడు. ప్రముఖ మ్యాగజిన్ ఫోర్స్ 2017లో ప్రచురించిన ఆసియాలోని 30 ఏళ్ల లోపు 30 మంది అంటూ ప్రచురించిన జాబితాలో శ్రీకాంత్ వాళ్ళకు చోటు దక్కటం నిజంగా అభినందించదగ్గ విషయం. ఇకపోతే 2022లో స్వాతిను ఆయన వివాహం చేసుకున్నారు. తాజాగా వీళ్ళిద్దరూ తల్లిదండ్రులు కూడా అయ్యారు.