NTV Telugu Site icon

Madhya Pradesh: 7వ తరగతి విద్యార్థినిపై 9వ తరగతి విద్యార్థి అత్యాచారం..

Madhya Pradesh

Madhya Pradesh

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. పాఠశాల ప్రిన్సిపాల్‌ ఫిర్యాదు మేరకు బహోదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో నిందితుడు విద్యార్థిపై పోక్సో చట్టం కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. గ్వాలియర్‌లో ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి 7వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జూలై 13న జరిగింది. ఈ ఘటనపై పాఠశాల యాజమాన్యం.. ఇద్దరు విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి చర్చించారు. ఆ తర్వాత ఆదివారం.. పాఠశాల ప్రిన్సిపాల్ అజయ్ సింగ్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

RC16: రెహమాన్‭తో బిజీగా బుచ్చిబాబు.. మంచి స్పీడ్ మీద ఉన్నారే..

కాగా.. వెంటనే నిందితుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన గురించి తెలియగానే పాఠశాల యాజమాన్యం ఈ విషయం బయటకు తెలియకుండా.. పిల్లలిద్దరినీ వేర్వేరు గదుల్లో ఉంచి నిఘాలో ఉంచింది. ఈ విషయాన్ని మొదట పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులకు చెప్పకుండా సీక్రెట్ గా ఉంచింది. అయితే.. జూలై 13న సాయంత్రం బాధిత విద్యార్థిపై వైద్యులు ఆరోగ్య పరీక్షలు చేయగా.. టాయిలెట్‌లో కొంచెం రక్తం వచ్చింది.

Prime Minister Modi: రికార్డు సృష్టించిన ప్రధాని.. మోడీకి ఎక్స్ లో 100 మిలియన్ల ఫాలోవర్స్..

దీంతో విద్యార్థి అత్యాచారం చేశాడని వెంటనే ఇరువురి విద్యార్థుల కుటుంబాలను పాఠశాలకు పిలిపించారు. ఈ విషయం గురించి ఇద్దరు తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో.. బాలిక తల్లిదండ్రులు నిందితుడిపై కేసు నమోదు చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్ ప్రిన్సిపాల్ ఈ ఘటనపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా.. పాఠశాలలో జరిగిన ఈ ఘటన పాఠశాల నిర్వహణపై ప్రశ్నార్థకంగా మారింది. ఇంతకుముందు ఏడేళ్ల క్రితం కూడా ఈ పాఠశాలలో ర్యాగింగ్‌ వ్యవహారం జరిగింది. అయితే.. తాజాగా ఈ ఘటన వెలుగులోకి రావడంతో పాఠశాలపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.