Site icon NTV Telugu

Boy Suicide: నువ్వు లేనప్పుడు ఎవరూ లేరనిపిస్తుంది.. లేఖ రాసి 9వ తరగతి బాలుడు ఆత్మహత్య

Boy Suicide

Boy Suicide

Boy Suicide: చిన్న విషయాలకు విలువైన ప్రాణాలు తీసుకుంటున్నారు నేటి తరం పిల్లలు. చదువుకునే విద్యార్థుల నుంచి కాటికి కాలు చాచిన వృద్ధుల వరకూ చాలా మంది తమ సమస్యలకు బలవన్మరణమే పరిష్కారమని భావిస్తూ ప్రాణాలు బలితీసుకుంటున్నారు. సిల్లీ కారణాలతో మనస్తాపం చెంది జీవితాలను అర్ధాంతరంగా ముగిస్తున్నారు. ముఖ్యంగా యువత ఆత్మహత్యలకు ఎక్కువగా పాల్పడుతోంది. ఇక ప్రేమ పేరుతో బలవుతున్న ప్రాణాలకు లెక్కే లేదు. సూసైడ్ లెటర్‌ రాసి 9వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన విశాఖపట్నంలోని గాజువాకలో చోటుచేసుకుంది. గాజువాకలోని కైలాస్ నగర్‌కు చెందిన పెంట అఖిల్ ప్రేమ వ్యవహారం నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఘాటైన ప్రేమ వ్యాఖ్యలతో సూసైడ్ నోట్ రాసి.. ఫ్యాన్‌కు ఉరేసుకున్నట్లు తెలిసింది.

Also Read: World Lung Cancer Day: ఊపిరితిత్తుల క్యాన్సర్ కు కారణాలు.. లక్షణాలు ఏంటో తెలుసా?

మృతదేహం దగ్గర ఉన్న సూసైడ్‌ లెటర్‌లో “నువ్వు నాతో ఉన్నప్పుడు నాకు ఇంకెవరూ వద్దనిపిస్తుంది. నువ్వు నాతో లేనప్పుడు నాకంటూ ఎవరూ లేరనిపిస్తుంది.” అని రాసున్న లేఖ లభ్యమైంది. ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమని స్థానికులు తెలిపారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌ మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version