NTV Telugu Site icon

Gaddar Awards : గద్దర్ అవార్డుల విధి విధానాల రూపకల్పన కోసం 17 మందితో కమిటీ

Gaddar Awards

Gaddar Awards

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమకు గతంలో ఇచ్చిన నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులను అందజేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే గద్దర్ అవార్డుల కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ కమిటీకి చైర్మన్‌గా ప్రముఖ దర్శకుడు బి.నర్సింగరావు, వైస్ చైర్మన్‌గా ప్రముఖ నిర్మాత దిల్ రాజును నియమించింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఇచ్చిన ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం… గద్దర్ అవార్డుల విధివిధానాలు, నియమ నిబంధనలు, లోగోను రూపొందించేందుకు సినీ ప్రముఖులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ సర్కార్‌.

Rainy Season: వర్షాకాలంలో బీర్లు తాగితే మలేరియా, డెంగ్యూ తప్పువు!… ఆశ్చర్యంగా ఉందా.. ఇది చదవండి

అయితే.. ఈ కమిటీ సలహాదారులుగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, అందెశ్రీ, తమ్మారెడ్డి భరద్వాజ, దగ్గుబాటి సురేశ్, చంద్రబోస్, తనికెళ్ల భరణి, ఆర్.నారాయణమూర్తి, వందేమాతరం శ్రీనివాస్, అల్లాణి శ్రీధర్, అల్లు అరవింద్, సానా యాదిరెడ్డి, హరీశ్ శంకర్, గుమ్మడి వెన్నెల, బలగం వేణులను నియమించింది. ఎఫ్‌డీసీ ఎండీ ఈ కమిటీకి మెంబర్-కన్వీనర్‌గా వ్యవహరిస్తారంటూ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎఫ్‌డీసీ ఈ కమిటీతో చర్చించి తదుపరి కార్యాచరణ మొదలు పెట్టాలని ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం.

NGT: పంజాబ్‌లో 53.87 టన్నుల వ్యర్థాలు.. ప్రభుత్వానికి రూ.1026 కోట్ల జరిమానా!