NTV Telugu Site icon

Pakistan: 150 ఏళ్ల నాటి హిందూ దేవాలయాన్ని కూల్చివేసిన పాకిస్థాన్

Hindu Temple

Hindu Temple

పాకిస్థాన్‌ దేశంలోని కరాచీలో ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన హిందూ దేవాలయాన్ని అక్కడి అధికారులు కూల్చివేసింది. కరాచీలోని సోల్జర్‌ బజార్‌లో 150 ఏళ్లకుపైగా చరిత్ర కల్గిన మారిమాత ఆలయం ఉంది. అయితే, షాపింగ్‌ ప్లాజా నిర్మించేందుకు గత శుక్రవారం గుర్తు తెలియని బిల్డర్‌ ఆలయాన్ని పడగొట్టారు. ఆలయ భూమిని షాపింగ్‌ ప్లాజా ప్రమోటర్‌కు రూ.7కోట్లకు అమ్మినట్లు తెలుస్తోంది. ఈ ఆలయాన్ని పోలీసుల సమక్షంలో బూల్డోజర్ల సహాయంతో కూల్చివేశారు. ఈ ఆలయాన్ని కరాచీలోని మద్రాసీ హిందూ సమాజం నిర్వహిస్తోంది. అయితే, ఆలయ నిర్మాణం చాలా పురాతనమైందని, ఆలయ నిర్వాహకులు అయిష్టంగానే తాత్కాలికంగా దేవతా విగ్రహాలను చిన్న గదిలో ఉంచి.. అక్కడ కొన్ని పునర్నిర్మాణ పనులు చేస్తున్నాట్లు తెలుస్తోంది.

Read Also: Pawan Kalyan: సీఐ అంజూయాదవ్‌పై ఎస్పీకి పవన్‌ కల్యాణ్‌ ఫిర్యాదు.. లేఖలో ఏముందంటే..

కాగా గతేడాది జూన్‌లో మారిమాత దేవాలయంలోని దేవతా విగ్రహాలను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారని పంచ్‌ముఖి హనుమాన్‌ మందిర్‌ కేర్‌టేకర్‌ రామ్‌నాథ్‌ మిశ్రా మహారాజ్‌ వెల్లడించారు. ఆలయం కూల్చివేతకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం తెలియదని ఆయన అన్నారు. దేవాలయాన్ని కూల్చివేశారని, ప్రహరి, ప్రధాన ద్వారాన్ని వదిలేసి.. లోపలి నిర్మాణాన్ని పూర్తిగా పడగొట్టారని ఆయన ఆరోపించారు.

Read Also: Mobile Phones Banned: కేదార్‌నాథ్ ఆలయ ప్రాంగణంలో మొబైల్ ఫోన్స్ నిషేదం

ఈ ఆలయాన్ని దాదాపు 150 ఏళ్ల కిందట నిర్మించారని, దాని ప్రాంగణం కింద నిధి ఉన్నట్లు అనేక కథలు చెప్పుకునేవారని తెలుస్తోంది. అయితే, సుమారు 400-500 చదరపు గజాల విస్తీర్ణంలోని ఈ ఆలయంపై భూకబ్జాదారులు కన్నేశారు. అయితే, ఈ ఆలయం ప్రమాదకరమైన కట్టడమని అధికారులు ప్రకటించడంతో కూల్చివేసినట్లు స్థానిక పోలీసు అధికారి ఒకరు తెలిపారు. కాగా పాకిస్తాన్‌లో హిందువులు అతిపెద్ద మైనారిటీ కమ్యూనిటీగా కొనసాగుతున్నారు. పాకిస్తాన్ హిందూ జనాభాలో ఎక్కువ మంది సింధ్ ప్రావిన్స్‌లో స్థిరపడ్డారు. ఈ ఘటనపై హిందూ సమాజం హిందూ కౌన్సిల్, సింధ్ ముఖ్యమంత్రి సయ్యద్ మురాద్ అలీ షా, సింధ్ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్ జనరల్‌కు విజ్ఞప్తి చేసినా వారు పట్టించుకోలేదని వార్తలు వినిపిస్తున్నాయి.