Atrocious : సినిమాల ప్రభావమో పెరిగే వాతావరణ ప్రభావమో తెలియదు కానీ..ఈ మధ్య చిన్న పిల్లలే దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. 13 ఏళ్ల బాలిక ప్రియుడితో సన్నిహితంగా ఉండగా ఆమె సొంత 9 ఏళ్ల చెల్లెలు చూసింది. ఈ విషయాన్ని ఎక్కడ తల్లిదండ్రులకు చెబుతుందో అన్న భయంతో ఆ బాలిక చెల్లెలు పట్ల దారుణంగా ప్రవర్తించింది. ప్రియుడితో కలిసి చెల్లిని క్రూరంగా చంపేసింది. అనంతరం ఏమీ తెలియనట్టు నటించింది. కానీ పోలీసుల దర్యాప్తులో ఆమె నేరం అంగీకరించింది. ఈ ఘటన బీహార్ లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. బీహార్ లోని వైశాలి జిల్లాలోని జందాహా బ్లాక్ లో దంపతులు తమ13 ఏళ్లు, 9 ఏళ్ల వయసు గల తమ కూతుర్లతో కలిసి జీవిస్తున్నారు. అయితే పేరెంట్స్ ఇటీవల ఓ పెళ్లి వేడుక కోసం వేరే గ్రామానికి వెళ్లారు. అక్కడే నాలుగైదు రోజులు ఉన్నారు. ఈ క్రమంలో 13 ఏళ్ల బాలిక తన ప్రియుడితో ఇంటి వద్ద సన్నిహితంగా మెలిగింది. దీనిని చెల్లెలు చూసింది. దీంతో అక్క, ఆమె ప్రియుడు ఒక్క సారిగా కంగుతిన్నారు. చెల్లి తన విషయం ఎక్కడ బయటపెడుతుందోనని భయంతో అక్క, ఆమె ప్రియుడు కలిసి ఆ బాలికను చంపేశారు. అనంతరం డెడ్ బాడీని ఇంట్లోనే ఉంచారు. అయితే రెండు, మూడు రోజుల తరువాత మృతదేహం కుళ్లిపోయి, దుర్వాసన రావడం మొదలయ్యింది. దీంతో ఆ మృతదేహాన్ని నరికి యాసిడ్ పోసి ఇంటి పెరట్లో పడేశారు. నాలుగైదు రోజుల తరువాత తల్లిదండ్రులు ఇంటికి చేరుకున్నారు. అయితే వారికి చిన్న కూతురు కనిపించలేదు. ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Read Also:SSMB 28: తుఫాన్ వస్తుంది… అలర్ట్ గా ఉండండి
ఈ క్రమంలో కొందరు స్థానికులు మృతదేహాలను గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. డాగ్ స్క్వాడ్, ఎఫ్ఎస్ఎల్ బృందం ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం బాలిక అవశేషాలను సేకరించారు. వారి దర్యాప్తులో ఆ డెడ్ బాడీ తప్పిపోయిన బాలికదిగా గుర్తించారు. అనంతరం ఆధారాలను ల్యాబ్‌కు పంపించి శవపరీక్ష కూడా నిర్వహించారు. పోలీసులు దర్యాప్తులో భాగంగా బాధితురాలి అక్కను ప్రశ్నించారు. దీంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపించి మొత్తం సంఘటనలను బయటపెట్టింది. ఈ ఘటనపై వైశాలి ఎస్పీ రవి రంజన్ కుమార్ మాట్లాడుతూ.. మే 16న తొమ్మిదేళ్ల బాలిక అదృశ్యమైందని, మే 19న ఆమె అవశేషాలు లభ్యమయ్యాయని తెలిపారు. ఈ ఘటనలో తగిన సాక్ష్యాధారాలు లభించడంతో మంగళవారం సాయంత్రం ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని చెప్పారు.
Read Also:IPL 2023: ఐపీఎల్ ఫైనల్ తర్వాతే.. ఆసియా కప్ వేదికపై తుది నిర్ణయం
