Site icon NTV Telugu

Ayodhya: చిన్నారుల అక్రమ రవాణా.. 95 మందిని రక్షించిన అధికారులు

Chi

Chi

పెద్ద ఎత్తున అక్రమంగా తరలిస్తున్న చిన్నారులను రెస్క్యూ ఆపరేషన్ చేసి ఉత్తరప్రదేశ్ చైల్డ్ కమిషన్ రక్షించింది. 95 మంది చిన్నారులను అధికారులు రక్షించారు. బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్‌కు తరలిస్తుండగా చాకచక్యంగా చిన్నారులను కాపాడారు.

ఇది కూడా చదవండి: Bandi Snajay: చీటర్స్, లూటర్స్ లకు.. ఒక ఫైటర్ కి జరుగుతున్న ఎన్నికలు..

ఇంత పెద్ద స్థాయిలో పిల్లల అక్రమ రవాణా చేయడంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులను అక్రమ రవాణా చేస్తున్నట్లుగా సమాచారం రాగానే సీడబ్ల్యూసీ సభ్యులు చిన్నారులను రక్షించారని అయోధ్య చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్‌పర్సన్ సర్వేష్ అవస్థి తెలిపారు. యూపీ చైల్డ్ కమిషన్ సభ్యురాలు సుచిత్ర చతుర్వేది ఫోన్ చేసి సమాచారం అందించారని తెలిపారు. బీహార్ నుంచి మైనర్ పిల్లలను అక్రమంగా సహరాన్‌పూర్‌కు రవాణా చేస్తున్నారని.. వారు గోరఖ్‌పూర్‌ వెళ్తున్నట్లుగా తెలిసిందన్నారు. అయోధ్య మీదుగా వెళ్తున్నారని చెప్పారు. పిల్లల్ని రక్షించి వారికి ఆహారం.. వైద్యం అందించినట్లుగా అవస్తి చెప్పారు. రక్షించబడిన చిన్నారులంతా 4-12 ఏళ్లలోపు వారేనని తెలిపారు.

ఇది కూడా చదవండి: YSRCP Manifesto 2024: నేడు వైసీపీ మేనిఫెస్టో విడుదల.. నవరత్నాలకు అప్‌గ్రేడెడ్‌ వెర్షన్‌..!

తల్లిదండ్రుల నుంచి ఎలాంటి సమ్మతి పత్రాలు లేకుండానే పిల్లల్ని తీసుకెళ్తున్నట్లుగా సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ తెలిపారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియలేదని పేర్కొన్నారు. పిల్లలంతా పన్నేండ్లలోపు వారేనని తెలిపారు. తల్లిదండ్రుల్ని సంప్రదించి పిల్లల్ని వారికి అప్పగిస్తామని సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ పేర్కొన్నారు.

Exit mobile version