NTV Telugu Site icon

90’s – A Middle Class Biopic: 90s-ఎ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌కు సీజన్ 2, 3!

90's A Middle Class Biopic

90's A Middle Class Biopic

90’s A Middle Class Biopic Record: ‘#90s-ఎ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌’ వెబ్ సిరీస్ భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఎలాంటి అంచలనాలు లేకుండా వచ్చిన ఈ వెబ్ సిరీస్.. అందరికీ కనెక్ట్ అయింది. టైటిల్‌కు పెట్టిన ట్యాగ్ లైన్‌కు తగ్గట్టుగానే ఇది మిడిల్ క్లాస్ బయోపిక్. కంటెంట్ బాగుందని తెలిస్తే ఆడియెన్స్ ఎగబడి చూస్తారనడానికి ఇది ఓ ఉదాహరణ. ప్రముఖ ఓటీటీ వేదిక ‘ఈటీవీ విన్‌’లో రిలీజైన ఈ సిరీస్‌.. సరికొత్త రికార్డుని సాధించింది. ఈ ఏడాది ప్రథమార్ధంలో భారతదేశంలోని ప్రేక్షకులు ఎక్కువగా వీక్షించిన తెలుగు సిరీస్‌గా ఇది నిలిచింది. తాజాగా ఈ సిరీస్‌ గురించి ఈటీవీ నెట్‌వర్క్‌ సీఈఓ కె.బాపినీడు ఓ అప్‌డేట్ ఇచ్చారు.

‘ఈటీవీ విన్‌ ఎప్పుడూ కొత్త ఆలోచల్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది. ప్రతి నెల కొత్త దర్శకులు రూపొందించిన ఓ సిరీస్‌, ఓ సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. ప్రస్తుత తరానికి తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను గుర్తుచేస్తూ.. కుటుంబం మొత్తం కలిసి చూసే కంటెంట్‌ని అందించడమే మా లక్ష్యం. 90sని ఆదరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఈ సిరీస్‌కి కొనసాగింపుగా 2, 3 భాగాలను వచ్చే ఏడాదిలో తీసుకొస్తాం’ అని ఈటీవీ నెట్‌వర్క్‌ సీఈఓ ఓ ప్రకటనలో తెలిపారు.

Also Read: Naga Chaitanya New Movie: హిట్ డైరెక్టర్‌తో నాగ చైతన్య సినిమా.. మరోసారి ఆ స్టార్ హీరోయిన్‌తో రొమాన్స్!

#90s-ఎ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌కు ఆదిత్య హాసన్‌ దర్శకత్వం వహించారు. నవీన్‌ మేడారం నిర్మించిన ఈ సిరీస్‌లో శివాజీ, వాసుకీ ఆనంద్, రోహన్, వాసంతిక, మౌళి ప్రధాన పాత్రల్లో నటించారు. ఓర్మాక్స్‌ పవర్‌ రేటింగ్‌ (ఓపీఆర్‌) ప్రకారం ఈ సిరీస్‌ 83 రేటింగ్‌ని సొంతం చేసుకుంది. కోటా ఫ్యాక్టరీ, పంచాయత్‌, బిఖీబి లాంటి సిరీస్‌లు కూడా 90s ముందు తేలిపోయాయి. 90sకి 2, 3 భాగాలు వస్తున్న విషయం తెలుసుకున్న ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Show comments