Explosion: బాణాసంచా గోదాంలో పేలుడు.. 9 మంది మృతి, 100 మందికి పైగా గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Blast At Fireworks Warehouse In Thailand: థాయ్‌లాండ్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. శనివారం థాయ్‌లాండ్‌లోని బాణసంచా గోదాములో పేలుడు సంభవించి తొమ్మిది మంది మరణించగా.. 100 మందికి పైగా గాయపడ్డారని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. దక్షిణ ప్రావిన్స్ నరాతీవాట్‌లోని సుంగై కొలోక్ పట్టణంలో జరిగిన పేలుడు భవనం నిర్మాణ పనుల సమయంలో వెల్డింగ్ చేయడం వల్ల సంభవించినట్లు భావిస్తున్నారు. సుంగై కోలోక్‌లో బాణసంచా నిల్వచేసే గోదాం ఈ మధ్యాహ్నం పేలిందని, ఈ ఘటనలో తొమ్మిది మంది మరణించగా.. 115 మంది గాయపడ్డారని నరాతీవాట్ గవర్నర్ సనన్ పొంగక్సోర్న్ చెప్పారు.
Also Read: Pakistan: పాక్ యువకుడిని పెళ్లాడిన అంజుకి ఖరీదైన బహుమతులు.. ఏం ఇచ్చారంటే..!
Also Read
- CM Revanth Reddy: టీజీ సేఫ్ అమల్లోకి తెచ్చామన్న సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణలో ప్రారంభమైన కొత్త అథారిటీ..
- AP Assembly 2026: నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు.. గ్రూప్-1 అక్రమాలపై ప్రత్యేకంగా చర్చ!
- BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
- IND vs SL: భారత్ స్పిన్ ఉచ్చులో పడ్డ శ్రీలంక బ్యాటర్స్.. లంచ్ సమయానికి స్కోర్ ఎంతంటే.?
ప్రస్తుతం మంటలు అదుపులో ఉన్నాయని.. భవనం నిర్మాణంలో ఉన్నందున, స్టీల్ వెల్డింగ్ ప్రక్రియలో సాంకేతిక లోపం ఏర్పడిందని ప్రాథమిక దర్యాప్తు సూచిస్తోంది. పేలుడు ధాటికి పెద్ద ఎత్తున మంటలు చెలరేగి అనేక దుకాణాలు, ఇళ్లు, వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పెద్ద ఎత్తులు పొగలు వ్యాపించాయి. మలేషియా సరిహద్దులో ఉన్న పట్టణంలో పేలుడు కారణంగా 500 ఇళ్లు దెబ్బతిన్నాయని స్థానిక మీడియా తెలిపింది. ఈ పేలుడు వల్ల 100 మీటర్ల దూరంలో ఉన్న ఇళ్లు కూడా కంపించాయని స్థానికులు తెలిపారు. నిర్మాణ రంగంలో థాయ్‌లాండ్‌లో భద్రత తక్కువగా ఉంది. ఘోరమైన ప్రమాదాలు సర్వసాధారణం. గత నెలలో బ్యాంకాక్‌లో నిర్మాణంలో ఉన్న రోడ్డు వంతెన ట్రాఫిక్‌లో కూలిపోవడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: టీజీ సేఫ్ అమల్లోకి తెచ్చామన్న సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణలో ప్రారంభమైన కొత్త అథారిటీ..
-
Rahul Gandhi: రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట..
-
Husharu Pittalu OTT Release: అమెజాన్ ప్రైమ్‌లోకి ‘హుషార్ పిట్టలు’.. బోల్డ్ టీనేజ్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
AP Assembly 2026: నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు.. గ్రూప్-1 అక్రమాలపై ప్రత్యేకంగా చర్చ!
-
Allari Naresh : కామెడీ స్టార్ ‘అల్లరి నరేశ్’ ఈసారైనా నవ్విస్తాడా?
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్‌గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్‌బుక్‌లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!