Site icon NTV Telugu

Afghanistan: ఘోరం.. మందుపాతర పేలి 9 మంది చిన్నారుల మృతి

Blast

Blast

ఆఫ్ఘనిస్థాన్‌లో ఘోరం జరిగింది. మందుపాతర పేలి 9 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆఫ్ఘనిస్థాన్‌లోని గజ్నీ ప్రావిన్స్‌లోని గెరు జిల్లాలో ఆదివారం పాత మందుపాతర పేలడంతో తొమ్మిది మంది చిన్నారులు మరణించారని తాలిబాన్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. పిల్లలు మందుపాతరతో ఆడుకుంటున్న సమయంలో అది పేలిందని పేర్కొన్నారు. ఐదుగురు బాలికలతో సహా 4-10 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలు విగతజీవులుగా మారారని తెలిపారు.

ఇది కూడా చదవండి: YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే

పాత ల్యాండ్ మైన్‌తో ఆడుకుంటుండగా ఈ ఘటన జరిగింది. ముక్కుపచ్చలారని చిన్నారులకు అది బాంబు అని తెలియక దానితో ఆడుకుంటున్నారు. దీంతో అది కాస్తా పేలడంతో అక్కడికక్కడే చిన్నారులు చనిపోయారని తాలిబాన్ ప్రతినిధి సోమవారం వెల్లడించారు.

ఇది కూడా చదవండి: SL vs BAN: ఏందయ్యా ఇది.. పిచ్చి ముదిరింది వీళ్లకీ.. వీడియో వైరల్

గత కొంత కాలంగా ఆఫ్ఘనిస్థాన్ కరువు కాటకాలతో అల్లాడుతోంది. ఇదిలా ఉంటే అక్కడ ప్రభుత్వాన్ని తాలిబన్లు తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఇతర దేశాలతో కూడా వారికి సంబంధాలు తెగిపోయాయి. తాలిబన్ల పాలనతో ఆయా వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 1979లో సోవియట్ దండయాత్ర. ఆ తర్వాత జరిగిన అంతర్యుద్ధం. అటు తర్వాత విదేశీ మద్దతుగల ప్రభుత్వాలకు వ్యతిరేకంగా 20 ఏళ్ల తాలిబాన్ తిరుగుబాటు. దశాబ్దాల సంఘర్షణతో ఆఫ్ఘనిస్థాన్ గనులు, గ్రెనేడ్‌లు, మోర్టార్‌లతో నిండిపోయాయి.  అయితే పేలని ఆయుధాలు ప్రాణాలను బలిగొంటున్నాయి.

ఇది కూడా చదవండి: Curryleaves Benefits : కరివేపాకును ఇలా తీసుకుంటే చాలు.. ఒంట్లో కొవ్వు వెన్నలా కరిగిపోతుంది..

Exit mobile version