Ladakh: ఘోర ప్రమాదం.. 9 మంది భారత జవాన్లు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ladakh: లడఖ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. శనివారం లడఖ్‌లోని లేహ్ జిల్లాలో వారి వాహనం రోడ్డుపై నుంచి లోతైన లోయలో పడిపోవడంతో తొమ్మిది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ లడఖ్‌లోని నియోమాలోని ఖేరీ సమీపంలో శనివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.
ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వారు తెలిపారు. మరొకరు తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వాహనంలో 10 మంది సైనికులు ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు. జవాన్లు కేరే గ్యారిసన్ నుంచి లేహ్ సమీపంలోని ఖేరీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఖేరీ పట్టణానికి 7 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read
- AP Rain Alert: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు..!
- OTR: జగన్ నో కాంప్రమైజ్.. కానీ అనంతపురం నేతల కొత్త గేమ్ ఏంటి?
- SA Vs AUS: ఆస్ట్రేలియాపై వీర విహారం.. సెంచరీతో చెలరేగిన యువ బ్యాటర్ మాథ్యూ..
- Off The Record: మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇస్తారా? ఒకవేళ ఇస్తే పరిస్థితి ఏంటి?
లడఖ్‌లో జరిగిన ప్రమాదం గురించి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లేహ్ సమీపంలో జరిగిన ప్రమాదంలో భారత ఆర్మీ సిబ్బందిని కోల్పోవడం బాధాకరమన్నారు. దేశానికి వారు చేసిన సేవలను మనం ఎప్పటికీ మరువలేమన్నారు. తమ ఆలోచనలు మృతుల కుటుంబాలతో ఉన్నాయని.. గాయపడిన సిబ్బందిని ఫీల్డ్ ఆసుపత్రికి తరలించారన్నారు. వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.
Ladakh | Seven Indian Army soldiers lost their lives in an accident 7 km short of Kyari town when their vehicle fell in a gorge. Many others are injured in the incident. The troops were moving from Karu garrison to Kyari near Leh. Many troops have suffered injuries also in the… pic.twitter.com/lAABfH5Zav
— ANI (@ANI) August 19, 2023
తాజావార్తలు
-
Hanuman Ansh : ‘హనుమాన్ అంశ్’చూడాలన్న తెలుగు ఆడియన్స్ కల తీరుతుందా?
-
AP Rain Alert: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు..!
-
OTR: జగన్ నో కాంప్రమైజ్.. కానీ అనంతపురం నేతల కొత్త గేమ్ ఏంటి?
-
SA Vs AUS: ఆస్ట్రేలియాపై వీర విహారం.. సెంచరీతో చెలరేగిన యువ బ్యాటర్ మాథ్యూ..
-
Off The Record: మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇస్తారా? ఒకవేళ ఇస్తే పరిస్థితి ఏంటి?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!