Site icon NTV Telugu

Indian Citizenship: ఈ ఏడాది భారత పౌరసత్వాన్ని ఎంత మంది వదులుకున్నారో తెలుసా..?

Indian

Indian

ఈ సంవత్సరం జూన్ నాటికి 87 వేల 26 మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని విదేశాంగ మంత్రి జైశంకర్ వెల్లడించారు. దీంతో 2011 నుంచి ఇప్పటి వరకు 17.50 లక్షల మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారని మంత్రి లిఖితపూర్వక ఆన్సర్ ఇచ్చారు. కాగా, 2020 నుంచి ఇప్పటి వరకు 5లక్షల 61వేల 272 మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ లోక్ స‌భ‌లో ప్రవేశ పెట్టిన ఒక ప్రకటనలో తెలిపారు. 2020లో మొత్తం 85,256 మంది వ్యక్తులు తమ భారత పౌరసత్వాన్ని రద్దు చేసుకున్నారు.

Read Also: Palvai Sravanthi: మణిపూర్ అల్లకల్లోలంపై ప్రధాని మోడీ స్పందించకపోవడం సిగ్గుచేటు

కానీ 2021,2022 సంవత్సరాలలో ఈ సంఖ్య భారీగా పెరిగింది. 2021లో 1 లక్ష 63 వేల 370 మంది, 2022లో 2 లక్షల 25 వేల 620 మందికి చేరుకుంది. అయితే, 2011లో అత్యధికంగా 1, 22,819 మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నట్లు ప్రభుత్వ డేటాలో ఉంది. గత రెండు దశాబ్దాల్లో ప్రపంచ పౌరసత్వ కార్యాలయాన్ని అన్వేషించే భారతీయ పౌరుల సంఖ్య గణనీయంగా పెరిగింది. వారిలో చాలా మంది వ్యక్తిగత సౌలభ్యం కోసం విదేశీ పౌరసత్వాన్ని ఎంచుకున్నారని విదేశాంగ శాఖ మంత్రి తెలిపారు. విదేశాల్లో ఉన్న భారతీయ సమాజాన్ని దేశానికి ఆస్తిగా గుర్తించిన జైశంకర్, ప్రవాస భారతీయులతో సంబంధాల్లో ప్రభుత్వం పరివర్తనాత్మక మార్పును తీసుకువచ్చిందని పేర్కొన్నారు. విజయవంతమైన, సంపన్నమైన, ప్రభావవంతమైన డయాస్పోరా నెట్వర్క్ ల‌ను అందిపుచ్చుకోవడం, జాతీయ ప్రయోజనాల కోసం దాని ఖ్యాతిని ఉపయోగించుకోవడమే తమ విధానమ‌ని ఆయన అన్నారు.

Read Also: Janhvi Kapoor: దేవర బ్యూటీ.. భలే ఇరుక్కుపోయిందే

భారత్ ద్వంద్వ పౌరసత్వాన్ని అనుమతించదనీ, ఇతర దేశాల్లో పౌరసత్వం కోరుకునే వారు తమ భారతీయ పౌరసత్వాన్ని వదులుకోవాల్సిందేనని కేంద్రమంత్రి జైశంకర్ అన్నారు. భారత పౌరసత్వాన్ని వదులుకున్న వారు సూడాన్, యెమెన్, మయన్మార్ వంటి తెలిసిన భద్రతా పరిస్థితులతో పాటు భారతదేశ పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంకతో సహా 135 ఇతర దేశాలకు వెళ్లారని ప్రభుత్వ డేటాలో ఉంది. అయితే ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారో అనేది మాత్రం వెల్లడించలేదు.

Exit mobile version